కుబేర ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశ ఎదురుకానుందా?

కుబేర చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు తేదీ ఇప్పటికే అధికారికంగా ఖరారైంది. మంచి హిట్ అయిన ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ ఓటీటీ వెర్షన్ గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది.

Published on: Jul 12, 2025 10:49 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమా ప్రశంసలు దక్కించుకోవడంతో కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఈ క్రైమ్ సోషల్ డ్రామా చిత్రంలో తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. డేట్ కూడా అధికారికంగా ఖరారైంది. అయితే, ఓటీటీ వెర్షన్ విషయంలో ఓ నిరాశ ఎదురుకానుందని తెలుస్తోంది.

కుబేర ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశే ఎదురుకానుందా!
కుబేర ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశే ఎదురుకానుందా!

డిలీట్ చేసిన సీన్లు లేకుండానే..

కుబేర చిత్రం థియేటర్లలోకి సుమారు మూడు గంటల రన్‍టైమ్‍తో వచ్చింది. కొన్ని సీన్లను కట్ చేస్తేనే ఆ నిడివి సాధ్యమైంది. అయితే, థియేట్రికల్ వెర్షన్ కోసం కట్ చేసిన కొన్ని డిలీటెడ్ సీన్లతో ఓటీటీలోకి కుబేర వస్తుందనే అంచనాలు వినిపించాయి. ఓటీటీ వెర్షన్ మరింత ఎక్కువ రన్‍టైమ్‍తో అదనపు సీన్లతో ఉంటుందనే రూమర్లు వచ్చాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ చిత్రం థియేట్రికల్ వెర్షనే వస్తుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

ఓటీటీలో డిలీటెడ్ సీన్లతో కుబేరచిత్రం వస్తుందేమోనని చాలా మంది ఆశించారు. దీనిపై మంచి బజ్ నడిచింది. అయితే, వారికి మాత్రం నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ వెర్షనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. థియేటర్లలో మంచి హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలోనూ సత్తాచాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

కుబేర సినిమా జూలై 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళంలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

బాక్సాఫీస్ హిట్

కుబేర చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. ఈ చిత్రం సుమారు రూ.135కోట్ల కలెక్షన్లను సాధించింది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఇది రూపొందింది. తెలుగులో ఈ మూవీకి ఎక్కువగా వసూళ్లు దక్కాయి.

కుబేర చిత్రాన్ని క్రైమ్ ఎలిమెంట్‍తో పాటు హృదయాన్ని తాకే ఎమోషన్లతో తెరకెక్కించారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఓ బడా వ్యాపారవేత్తపై ఓ యాచకుడి పోరాటం చుట్టూ ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో యాచకుడిగా ధనుష్ నటన అందరినీ మెప్పించింది. మరో నేషనల్ అవార్డ్ పక్కా అనే రేంజ్‍లో యాక్టింగ్‍తో ధనుష్అదరగొట్టారు. నాగార్జున కూడా డిఫరెంట్ పాత్రలో మెప్పించారు. రష్మిక కూడా ఆకట్టుకున్నారు. జిమ్ సర్భ్ నెగెటివ్ రోల్ చేశారు.

కుబేర సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, అజయ్ కైకాల ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీకి సంగీతం కూడా పెద్దబలంగా నిలిచింది. ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశారు.