ఓటీటీలో భయపెట్టే హారర్ థ్రిల్లర్- డిఫరెంట్ స్టోరీ- మనిషికి దేవతకు పుట్టే విచిత్రమైన పిల్లలు- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో డిఫరెంట్ స్టోరీతో భయపెట్టే హారర్ థ్రిల్లర్ మూవీ కుమారి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. గాడ్సే, పొన్నియన్ సెల్వన్ సినిమాల హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ, దసరా విలన్ షైన్ టామ్ చాకూ నటించిన మలయాళ హారర్ థ్రిల్లర్ కుమారి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Jul 20, 2025, 11:33:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎన్నో ఊహించని డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాలన్నీ బాగా ఆదరణ దక్కడంతో సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంటాయి. ఈ విధంగా అలాంటి ఓటీటీ సినిమాల్లో ఈ హారర్ థ్రిల్లర్ ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

ఓటీటీలో భయపెట్టే హారర్ థ్రిల్లర్- డిఫరెంట్ స్టోరీ- మనిషికి దేవతకు పుట్టే విచిత్రమైన పిల్లలు- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో భయపెట్టే హారర్ థ్రిల్లర్- డిఫరెంట్ స్టోరీ- మనిషికి దేవతకు పుట్టే విచిత్రమైన పిల్లలు- ఇక్కడ చూసేయండి!

మలయాళ హారర్ థ్రిల్లర్

ఆ సినిమానే కుమారి. 2022లో తెరకెక్కిన ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలో సత్యదేవ్ గాడ్సే, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాల హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ టైటిల్ రోల్ పోషించింది. అలాగే, నాని దసరా విలన్ షైన్ టామ్ చాకో మరో కీ రోల్ చేశాడు. వీరితోపాటు స్వాసిక విజయన్, సురభి లక్ష్మీ, గిజు జాన్, రాహుల్ మాధవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

కేరళలోని ఓ గ్రామంలో

హారర్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన కుమారి సినిమా కథ అంతా కేరళలోని ఓ గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామంలోని కట్టుబాట్లు, సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, అతీంద్రియ శక్తులు వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఒక మనవరాలికి తన అమ్మమ్మ ఓ దేవత కథ చెప్పడంతో కుమారి సినిమా ప్రారంభం అవుతుంది.

మనిషితో దేవత పెళ్లి

భూమి అందానికి పరవశించి వచ్చిన దేవత స్వర్గానికి తిరిగి వెళ్లదు. ఇక్కడే ఓ మనిషిని పెళ్లి చేసుకుని అతనితో చాతన్, గరి దేవన్ అనే పిల్లలను కంటుంది. కానీ, ఆ పిల్లలు మానవుల్లా కాకుండా, దేవతల రూపంతో లేకుండా విచిత్రంగా, వింతగా, అసాధారణ శక్తులతో పుడతారు.

భయపెట్టే సీన్లు

ఆ తర్వాత ఆ మనిషి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటీ అనే థ్రిల్లింగ్ అంశాలతో భయపెట్టే సీన్లతో కుమారి సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ నిర్మల్ సచ్‌దేవ్. ఇలాంటి కుమారి ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో కుమారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

మొన్నటివరకు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉన్న కుమారి ప్రస్తుతం మాత్రం నెట్ఫ్లిక్స్లో కేవలం మలయాళంలో ఇంగ్లీష్, హిందీ, తమిళ సబ్ టైటిల్స్‌తో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఐఎమ్డీబీ నుంచి పదికి 6.4 రేటింగ్ సాధించిన కుమారి మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More