Kushi Title Song Lyrics: ఖుషీ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇవే

Kushi Title Song Lyrics: ఖుషీ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇవే. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతిపాటా సూపర్ హిట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే రిలీజైన టైటిల్ సాంగ్ లిరిక్స్ మీకోసం.

Published on: Aug 7, 2023, 19:51:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kushi Title Song Lyrics: విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషీ మూవీ సెప్టెంబర్ 1న రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఇక బుధవారం (ఆగస్ట్ 9) ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు విజయ్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఈ మూవీ నుంచి వచ్చిన మూడు పాటలు ఇప్పటికే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో ఖుషీ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

ఖుషీ టైటిల్ సాంగ్ లిరిక్స్
ఖుషీ టైటిల్ సాంగ్ లిరిక్స్

ఈ మూడు పాటలూ మంచి మెలోడీల్లా ఉన్నాయి. ఈ మధ్యే ఖుషీ మూవీ టైటిల్ సాంగ్ కూడా రిలీజైంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. అతని ప్రతి పాటా యువత మనసును తాకేలా ఉంటున్నాయి. ఈ ఖుషీ టైటిల్ సాంగ్ కు మ్యూజిక్ అందించడంతోపాటు పాట కూడా అతడే పాడటం విశేషం. ఇక ఈ సాంగ్ లిరిక్స్ ను డైరెక్టర్ అయిన శివ నిర్వాణానే అందించాడు. ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ మీ సింగింగ్ టాలెంట్ చూపించండి.

ఖుషీ టైటిల్ సాంగ్ లిరిక్స్

ఖుషీ.. నువ్వు కనబడితే

ఖుషీ.. నీ మాట వినబడితే

మాంగల్యం తంతునానేనా

మవజీవన హేతునానే (3)

హే నెచ్చలి నెచ్చలి

వచ్చి విసిరినది

వెచ్చని వెచ్చని వల

హే ముచ్చటగా నను గిల్లీ గిచ్చినది కల

హే వెన్నెల వెన్నెల వెల్లి విసిరినది

కన్నుల కన్నుల మిలా

హే లంగరు దాటి దూకి పొంగినది అలా

హే నువ్వు నేను సాథి హే

నీతోనే నా ప్యారు హే

ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్ సాత్ హే

ఖుషీ.. నువ్వు కనబడితే

ఖుషీ.. నీ మాట వినబడితే

ఖుషీ.. నువ్వు జత కడితే

ఖుషీ.. నా ఒళ్లంత తుళ్ళి౦తే

తుమ్హారా మత్తులో ఎలా పడ్డాను పిచ్చిగా

హమారా మాయలో

ఇలా తేలానే హాయిగా

నిజం నే చెప్పనా

నువ్వేలే నాకు ఆశికి

ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ

దిల్ మే దడకన్

నీ ఊపిరి తగిలిందో

మన్ మే తుఫాన్

నిను తాకిన ఆ నిమిషం

హే నెచ్చలి నెచ్చలి

వచ్చి విసిరినది

వెచ్చని వెచ్చని వల

హే ముచ్చటగా నను గిల్లీ గిచ్చినది కల

హే నువ్వు నేను సాథి హే

నీతోనే నా ప్యారు హే

ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్ సాత్ హే

ఖుషీ.. నువ్వు కనబడితే

ఖుషీ.. నీ మాట వినబడితే

ఖుషీ.. నువ్వు జత కడితే

ఖుషీ.. నా ఒళ్లంత తుళ్ళి౦తే

మాంగల్యం తంతునానేనా

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More