...
...
Next Story

ఏడాది తర్వాత ఓటీటీలోకి రజనీకాంత్ డిజాస్టర్ మూవీ..కూతురే డైరెక్టర్..డిజిటల్ స్ట్రీమింగ్ లో 12 నిమిషాల ఎక్స్‌ట్రా రన్ టైమ్

థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత రజనీకాంత్ డిజాస్టర్ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఈ రోజే (జూన్ 6) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురే డైరెక్టర్. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

Published on: Jun 6, 2025, 07:12:16 IST
By ,
Prefer HTon Google
Advertisement

రజనీకాంత్ కీ రోల్ ప్లే చేసిన ‘లాల్ సలామ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టింది. శుక్రవారం (జూన్ 6) ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్టర్ కావడం గమనార్హం. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ దారుణంగా నిరాశపర్చింది. డిజాస్టర్ గా నిలిచింది.

అదే ఓటీటీలోకి

ఓటీటీలోకి రజనీకాంత్ సినిమా (x/sunnxt)
ఓటీటీలోకి రజనీకాంత్ సినిమా (x/sunnxt)

‘లాల్ సలామ్’ మూవీ ఈ రోజే ఓటీటీలోకి వచ్చేసింది. స‌న్ నెక్ట్స్‌ ఓటీటీలో తమిళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన లాల్ సలామ్ ఫిల్మ్ తీవ్రమైన పరాభవాన్ని ఎదుర్కొంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. భారీ నష్టాలు చవిచూసింది.

రూ.19 కోట్లే

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన లాల్ సలామ్ థియేట్రికల్ రన్ లో రూ.19 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీ సుమారు రూ.90 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ సినిమాలో రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ కీ రోల్స్ ప్లే చేశారు. లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. ఏఆర్ రెహమాన్మ్యూజిక్ డైరెక్టర్.

12 నిమిషాలు

ఓటీటీ కోసం ఈ మూవీ రన్ టైమ్ ను 12 నిమిషాలు పెంచారు. అదనపు సీన్స్ యాడ్ చేశారు. థియేటర్లలో ఈ మూవీ రన్ టైమ్ 150 నిమిషాలు. ఇప్పుడు ఎక్స్ ట్రా సీన్స్ యాడ్ చేశారు. హార్డ్ డిస్క్ మిస్ కావడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ కు ముహూర్తం కుదిరింది.

సూపర్ స్టార్ ఉన్నా

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks