లావణ్య త్రిపాఠి లక్కీ.. గోరుముద్దలు తినిపించే వరుణ్.. భర్త గురించి ఆమె ఏం చెప్పారంటే? వైరల్ గా వీడియో
మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తన భర్త, మెగా హీరో వరుణ్ తేజ్ తనను ఎంత బాగా చూసుకుంటారో వెల్లడించింది. అందాల రాక్షసి రీ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో లావణ్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల ఎంతో లక్కీ అని అంటున్నారు నెటిజన్లు. తన భర్త వరుణ్ తేజ్ ఆమెను అంత బాగా చూసుకుంటుండటమే అందుకు కారణం. సెలబ్రిటీ కపుల్స్ అంటే గొడవలు వస్తాయని, విడిపోతారని చాలా జంటలు నిరూపించాయి. కానీ ప్రేమగా కూడా ఉండొచ్చని కొంతమంది చాటిచెప్పారు. అలాంటి వాళ్లలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కచ్చితంగా ఉంటారు. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్లు వాళ్ల మధ్య ఉన్న అన్యోన్య దంపత్యానికి నిదర్శనంలా నిలిచాయి.

లావణ్య ఏం చెప్పిందంటే?
లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేసిన ఫస్ట్ మూవీ అందాల రాక్షసి. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో మూవీ యూనిట్ పార్టిసిపేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో భర్త వరుణ్ తేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది లావణ్య త్రిపాఠి.
‘‘అంతకంటే ముందు ఒంటరిగా బతికేదాన్ని. ఒక్కదానినే ఉండటం అలవాటైపోయింది. కానీ వరుణ్ వచ్చిన తర్వాత లైఫ్ మారిపోయింది. అతను నన్ను అమ్మలా చూసుకుంటున్నాడు. నాకు టైమ్ కు మెడిసిన ఇస్తాడు. చేతితో తినిపిస్తాడు. నేనెప్పుడూ ఎవరికీ తినిపించలేదు. నేను అడగకపోయినా తను నా కోసం అన్నీ చేస్తాడు’’ అని లావణ్య తెలిపింది.
ఆ మూవీ చేస్తున్నప్పుడు
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసిమిస్టర్ మూవీ చేశారు. ఈ సినిమా 2017లో రిలీజైంది. ఈ మూవీ షూటింగ్ లోనే లావణ్య, వరుణ్ మనసులు కలిశాయి. 2018లో ఈ జోడీ అంతరిక్షం సినిమా కూడా చేసింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట 2023 నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి ప్రెగ్నంట్. ఆమె గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఏడాది మే 6న సోషల్ మీడియాలో వరుణ్ ప్రకటించాడు.
రీ రిలీజ్
లావణ్య త్రిపాఠి డెబ్యూ మూవీ అందాల రాక్షసి. 2012లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ ఫీల్ గుడ్ మూవీ యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికీ ఎక్కడో ఓ దగ్గర వినిపిస్తూనే ఉన్నాయి. నవీన చంద్ర, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది. జూన్ 13న థియేటర్లకు రాబోతోంది. మరి రీ రిలీజ్ లో ఈ మూవీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



