కమల్ హాసన్ టైటిల్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి న్యూ మూవీ- ఫస్ట్ లుక్ రిలీజ్- భార్యాభర్తల అనుబంధం చెప్పేలా ఎమోషనల్‌గా!

మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటించిన సరికొత్త సినిమా సతీ లీలావతి. 1995లో కమల్ హాసన్ నటించిన టైటిల్‌తో వస్తున్న సతి లీలావతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా ఇవాళ (జూన్ 21) రిలీజ్ చేశారు. భార్యాభర్తల అనుబంధం చెప్పేలా ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సతీ లీలావతి ఉండనుంది.

Published on: Jun 21, 2025, 12:26:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేటి కాలంలో కుటుంబ వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డుతోంది. అందుకు కార‌ణం మ‌నుషుల మ‌ధ్య ఎమోష‌న్స్ లేక‌పోవ‌టమే.. భావోద్వేగాలే బంధాల‌ను క‌ల‌కాలం నిలుపుతాయి. రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత బ‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

కమల్ హాసన్ టైటిల్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి న్యూ మూవీ- ఫస్ట్ లుక్ రిలీజ్- భార్యాభర్తల అనుబంధం చెప్పేలా ఎమోషనల్‌గా!
కమల్ హాసన్ టైటిల్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి న్యూ మూవీ- ఫస్ట్ లుక్ రిలీజ్- భార్యాభర్తల అనుబంధం చెప్పేలా ఎమోషనల్‌గా!

మలయాళ నటుడితో

ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని హృద్యంగా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో మెగా కోడలు, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, మలయాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’.

డైరెక్టర్ గత సినిమాలు

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ సతీ లీలావతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దీన్ని రూపొందిస్తున్నారు.

ఎమోషనల్‌గానే కాకుండా

భార్యా భ‌ర్తల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా కామెడీ ఎంట‌ర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్ర‌య‌త్న‌మే స‌తీ లీలావ‌తి చిత్రం అని మేకర్స్ చెబుతున్నారు. సతీ లీలావతి సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

సతీ లీలావతి రిలీజ్ ప్లాన్

అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసి సతీ లీలావతి సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సతీ లీలావతి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

కాళ్లు చేతులు నోరు కట్టేసి

అయితే, తాజాగా ఇవాళ (జూన్ 21) సతీ లీలావతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కుర్చీలో దేవ్ మోహన్‌ కాళ్లు చేతులు కట్టేసి ఉంచారు. దేవ్ మోహన్ నోటికి కూడా కట్లు కట్టారు. అతనిముందు లావణ్య త్రిపాఠి మైక్ పట్టుకుని అరవడం ఫస్ట్ లుక్‌లో చూడొచ్చు.

మిక్కీ జే మేయర్ సంగీతం

భార్యాభర్తల మధ్య గొడవలను ఈ ఫస్ట్ లుక్‌తో చూపించినట్లుగా ఉంది. ఈ పోస్టర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే, సతీ లీలావతి సినిమాకు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ ఉన్నారు. అలాగే, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.

కమల్ హాసన్ మూవీ టైటిల్

ఇదిలా ఉంటే, సతీ లీలావతి సినిమా 1995లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా చేశారు. కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో వరుణ్ తేజ్ భార్య, మెగా కోడలు లావణ్య త్రిపాఠి సినిమా రావడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More