Lenin OTT: ఓటీటీలో లెనిన్ కొత్త చరిత్ర.. రెండు రోజుల్లోనే 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్.. ఆకాశంలో డ్రోన్లతో రచ్చ
Lenin OTT: అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ ఓటీటీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓటీటీలోకి అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం. ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై బ్రహ్మరథం పడుతున్నారు.
Lenin OTT: జీ5 (ZEE5 Telugu) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త రికార్డులు తిరగరాస్తూ 'లెనిన్' (Lenin) సంచలనం సృష్టిస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్‌కి వచ్చిన కేవలం 2 రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తూ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల ఆకాశంలో భారీ డ్రోన్ షోలు నిర్వహించడం ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఓటీటీలోనూ 'లెనిన్' ఊచకోత.. బాక్సాఫీస్ రికార్డు కంటిన్యూ
ఇటీవలే జీ5లో స్ట్రీమింగ్ మొదలైన 'లెనిన్' సినిమా మొదటి రోజు నుంచే ఆడియన్స్ నుంచి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ ప్రాజెక్ట్.. ఓటీటీ ఆడియన్స్‌ను స్క్రీన్లకు కట్టిపడేస్తోంది. రిలీజైన 48 గంటల్లోనే 100 మిలియన్ల (10 కోట్లు) స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి, క్లాస్ అండ్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది.
విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో అర్ధరాత్రి ఆకాశంలో వందలాది డ్రోన్లతో 'లెనిన్' రికార్డులను ప్రదర్శించారు. ఆకాశంలో డ్రోన్లు క్రియేట్ చేసిన విజువల్స్, 'లెనిన్' టైటిల్ లోగోలు చూసి జనాలు షాక్ అయ్యారు. ఈ డ్రోన్ షోకి సంబంధించిన వీడియోలు, పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రూరల్ బ్యాక్‌డ్రాప్, ఇంటెన్స్ యాక్షన్ తో ఆకట్టుకున్న కథ
తెలుగు ఓటీటీ స్పేస్‌లో విభిన్నమైన కంటెంట్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. 'లెనిన్' సినిమా విషయంలో కూడా అదే నిరూపితమైంది. గ్రామీణ నేపథ్యం, రాజకీయ చదరంగం, ఇంటెన్స్ రివెంజ్ డ్రామా, బలమైన ఎమోషన్లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
నటీనటులు తమ క్యారెక్టర్లలో జీవించేయడం, యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ రేంజ్‌లో డిజైన్ చేయడంతో వ్యూయర్స్ పదే పదే ఈ సినిమాను చూస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఓటీటీ వీక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌లా అనిపించడంతో ఈ రేంజ్ వ్యూయర్ షిప్ నమోదైంది.
జీ5 ప్రమోషన్స్ అదరహో.. ఆకాశమే హద్దుగా వేడుకలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక తెలుగు ఓటీటీ సినిమా సక్సెస్ కోసం మూడు ప్రధాన నగరాల్లో ఏక కాలంలో భారీ డ్రోన్ షోలు నిర్వహించడం డిజిటల్ మార్కెటింగ్‌లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. 'మనోడి బ్లాక్‌బస్టర్ హిస్టరీ క్రియేట్ చేసింది' అంటూ జీ5 టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా #BlockbusterLENIN, #TeluguZee5 హ్యాష్‌ట్యాగ్‌లు విపరీతంగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. థియేటర్లలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి అఖిల్ కెరీర్లో అత్యధిక కలెక్షన్ల సినిమా లెనిన్ నిలిచిన విషయం తెలిసిందే. ఆ బాక్సాఫీస్ ఊచకోత ఓటీటీలోనూ కొనసాగుతుండటం విశేషం. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. రాబోయే రోజుల్లోనూ లెనిన్ ఓటీటీ రికార్డుల పరంపర కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


