Ee Paata Korinavaru Trailer: చాంతాడంత టైటిల్.. లవర్‌ను షేర్ చేసుకునే అబ్బాయిలు.. ఈ పాట కోరినవారు.. మూవీ ట్రైలర్ చూశారా?

Ee Paata Korinavaru Trailer: ఈ పాట కోరిన వారు.. మూవీ ట్రైలర్ వచ్చేసింది. టైటిల్ కు తగినట్లే ఈ ట్రైలర్ కూడా చాలా భిన్నంగా సాగింది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ట్రైలర్ లాంచ్ చేశారు.

Published on: Sep 15, 2026, 20:42:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ee Paata Korinavaru Trailer: 'ఆ నలుగురు', 'మధుమాసం' లాంటి క్లాసిక్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టికల్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో రూపొందుతున్న 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రామ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ధోల్ రవి మొదలగువారు' సినిమా అఫీషియల్ ట్రైలర్ ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

Ee Paata Korinavaru Trailer: చాంతాడంత టైటిల్.. లవర్‌ను షేర్ చేసుకునే అబ్బాయిలు.. ఈ పాట కోరినవారు.. మూవీ ట్రైలర్ చూశారా?
Ee Paata Korinavaru Trailer: చాంతాడంత టైటిల్.. లవర్‌ను షేర్ చేసుకునే అబ్బాయిలు.. ఈ పాట కోరినవారు.. మూవీ ట్రైలర్ చూశారా?

టాలీవుడ్ హిస్టరీలోనే వినూత్న ప్రయోగం.. అనిల్ రావిపూడి సపోర్ట్

ఈ సినిమాకు 'A Forbidden Raag From A Forbidden Saga' అనేది సబ్‌టైటిల్. ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఇంత పొడవైన టైటిల్ ఏ చిత్రానికి లేదు. ఈ వినూత్న టైటిల్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

టీజర్ లాంచ్ చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ మూవీ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. గతంలో చంద్రసిద్ధార్థ్ దర్శకత్వం వహించిన 'మధుమాసం', 'హౌస్‌ఫుల్', 'అందరి బంధువయ' సినిమాలకు తాను స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన రోజులను అనిల్ గుర్తుచేసుకున్నారు. చంద్రసిద్ధార్థ్ వద్ద పనిచేయడం తనకు ఎంతో నేర్పించిందని, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకున్నారు.

బ్రెయిన్ మ్యాపింగ్, సౌండ్ థెరపీ.. కిక్కిచ్చే కాన్సెప్ట్

డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇప్పటికే టైటిల్‌తో ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ అయిందని, థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ మూవీ ఒక మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. సంగీతం, శబ్దం మానవ మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, తప్పు చేశామనే భావన లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మానవ సంబంధాలు, కోరికల చుట్టూ తిరిగే సన్నివేశాలు టీజర్‌లో చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. లవర్ ను షేర్ చేసుకునే ఇద్దరు అబ్బాయిలను ఈ ట్రైలర్ లో చూడొచ్చు.

కొత్త టాలెంట్‌తో గ్రాండ్ ఎంట్రీ.. సెప్టెంబర్ 18న రిలీజ్

ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై చంద్రసిద్ధార్థ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించగా, వై వి సత్యనారాయణ రాజు సమర్పిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హర్ష కథానాయకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. అమైరా గోస్వామి, సుజానా రెడ్డి, ఇనయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.

ఈ చిత్రానికి జె రెక్స్ అద్భుతమైన మ్యూజిక్ అందించగా, సామ్ సుప్రీత్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ప్రముఖ రచయిత పులగం చిన్నారాయణ పవర్‌ఫుల్ డైలాగ్స్ అందించారు. వినూత్న కథాంశంతో రూపొందిన ఈ థ్రిల్లర్ సెప్టెంబర్ 18, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More