కన్నప్ప వర్సెస్ చంద్రేశ్వర.. మంచు విష్ణు మూవీకి పోటీగా మరో మహాశివుడి భక్తి చిత్రం.. ఇలాంటి సినిమా రాలేదన్న నిర్మాత!
మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్పకు పోటీగా మరో భక్తి చిత్రం రానుంది. మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మరో సినిమా చంద్రేశ్వర. జూన్ 27న ఈ రెండు భక్తి సినిమాలు పోటీ పడనున్నాయి. ఆర్కియాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని నిర్మాత రవీంద్ర చారి తెలిపారు.
మంచు విష్ణు కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి స్టార్స్ నటించిన కన్నప్ప మూవీ జూన్ 27న అంటే రేపే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్పకు పోటీగా మరో మహాశివుడి భక్తి చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

మరో శివుని చిత్రం
జూన్ 27న మరో శివుని చిత్రం విడుదల కానుంది. ‘కన్నప్ప’తో పాటు మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించారు. సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా చేశారు.
చంద్రేశ్వర సినిమాకు జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వం వహించారు. ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా ‘చంద్రేశ్వర’ మూవీని తెరకెక్కించారు . ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. జూన్ 27న కన్నప్పకు పోటీగా చంద్రేశ్వర మూవీ గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆర్కియాలజీ నేపథ్యంలో
ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. "శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు ‘చంద్రేశ్వర’ మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాను. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది" అని అన్నారు.
"ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది? అనే అంశాలు ఆకట్టుకుంటాయి. ఆర్కియాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని గర్వంగా చెప్పగలం" అని నిర్మాత రవీంద్ర చారి పేర్కొన్నారు.
సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి
"ఈ సినిమాకు సంగీతం ప్రధాన హైలెట్‌గా ఉంటుంది. ఇందులో సాంగ్స్ అన్నీ అత్యద్భుతంగా వచ్చాయి. ‘ఈశ్వరా.. నా పరమేశ్వరా’, ‘అఖిల అఖిల’ డ్యూయెట్ సాంగ్, ‘నమస్తే చిదంబరం’ అనే సాంగ్.. ఇలా పాటలన్నీ వండర్‌ఫుల్‌గా వచ్చాయి. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండ్ అవుతున్నాయి" అని ప్రొడ్యూసర్ రవీంద్ర చారి తెలిపారు.
"సినిమా కూడా సస్పెన్స్, హారర్ అంశాలతో అత్యద్భుతంగా వచ్చింది. ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ వారంలో రెండు భక్తి సినిమాలు ఒకటి ‘కన్నప్ప’, రెండు ‘చంద్రేశ్వర’ పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము" అని నిర్మాత కోరారు.
చివరి నిమిషం వరకు
"దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. చివరి నిమిషం వరకు ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎటువంటి అశ్లీలత ఇందులో ఉండదు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని నిర్మాత రవీంద్ర చారి చెప్పారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



