Maar Muntha Chod Chinta Song Lyrics: మార్ ముంత చోడ్ చింత సాంగ్ లిరిక్స్ ఇవే.. డబుల్ ఇస్మార్ట్ నుంచి డబుల్ మాస్ సాంగ్
Maar Muntha Chod Chinta Song Lyrics: మార్ ముంత చోడ్ చింత అంటూ డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజైన సంగతి తెలుసు కదా. మాస్ బీట్స్ తోపాటు అదిరిపోయే లిరిక్స్ తో ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ అయింది.
Maar Muntha Chod Chinta Song Lyrics: డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి డబుల్ మాస్ తో వచ్చిన మార్ ముంత చోడ్ చింత సాంగ్ లిరిక్స్ చూశారా? మంగళవారం (జులై 16) రిలీజైన ఈ పాట మాస్ బీట్స్ తో ఊపేస్తోంది. ఉస్తాద్ రామ్ పోతినేని డ్యాన్స్, మణిశర్మ బీట్స్, రాహుల్ సిప్లిగంజ్ గళంతో ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ గా మారిపోయింది.

మార్ ముంత చోడ్ చింత లిరిక్స్
మార్ ముంత చోడ్ చింత పాటను కాసర్ల శ్యామ్ రాశాడు. మణిశర్మ మ్యూజిక్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్ సీపన, కీర్తన శర్మ పాడారు. హైదరాబాద్ గల్లీలు దద్దరిల్లేలా ఈ పాటను కంపోజ్ చేశారు. ఇక రామ్ ఎనర్జటిక్ స్టెప్పులు పాటకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.
లిరిక్స్ ఇవే..
కలకత్తా మీఠా పాన్‌లెక్క
మస్తుగున్నవు గానీ పోరీ..
నే బగర్‌కత్తా బాబా జర్దా
తట్టుకుంటవ చోరీ..
అమ్మనీయమ్మ బోరాన్ బోరాన్ ఉందిరా పోరీ
అర్రె మనమే అనుకున్నా.. ఇది కూడా బ్రాండేరా భయ్
నాగ నాగ నాగ నాగపురి సంత్ర
నలిపేస్తా రాయె నా టప్పా చబుత్రా
నాగ నాగ నాగ నాగపురి సంత్ర
ఆగ ఆగ ఆగమయ్యీ.. పడతలేదు నిద్ర
నువ్ గంతగింత గాదు అసలే డబుల్ ఇస్మార్టూ
నీ జోరు చూస్తే గూడ్సు రైలు గుద్దుకున్నట్టు
నువ్వు పూల పూల అంగి యేసి ఇస్టైల్ గొట్టు
ఓల్డ్ సిటీ ఊగిపోద ఓల్డ్ మంకు తాగినట్టు
సైసరాదే పూసలేసుకున్న పిల్లా..
పూసుకుంట నిన్ను చార్మినారు సెంటులా..
సీసలెక్క ఉన్న షేపు చూస్తె మల్లా..
పిస్సపిస్స ఐతాందే నా దిల్లులా..
ఏం జేద్దామంటవ్ మరి
మార్ ముంత చోడ్ చింత
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
యో బాయ్స్.. సీస మూత తీసింగ్స్..
గ్లాస్ ల మందు పోసింగ్స్..
గటాగటా తాగింగ్స్..
ఎంజాయ్.. పండుగో..
ఎంజాయ్.. పండుగో..
ఓ ప్యారీ.. తోతాపరీ..
బొమ్మల నడుమ బొట్టు ఏదే..
దార్కారీ.. నా శంకరీ..
నీ గుండెలపైనా అంటుకుందే..
నడిమిట్లున్నా.. నడుమట్లా తిప్పకే..
మునుపట్లా.. శెక్కరొచ్చిందే..
షంషేర్ అంటూ నడుసొస్తాంటే..
సెంటర్ల టక్కరయ్యిందే..
ఎర్రఎర్ర ఎర్రగున్న సెంపలల్లా..
సిర్రగోనె ఆడమంది సిగ్గు బిల్లా..
సుర్రసుర్ర సుర్రుమంటు సూడు పిల్లా..
వుండుండి కాలుతాందె కాకరపుల్లా..
ఏం జేద్దామంటవ్ మరి..
ఇగ జెప్తజూడు..
మార్ ముంత చోడ్ చింత
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
యో బాయ్స్.. సీస మూత తీసింగ్స్..
గ్లాస్ ల మందు పోసింగ్స్..
గటాగటా తాగింగ్స్..
ఎంజాయ్.. పండుగో..
ఎంజాయ్.. పండుగో..
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



