మరో గంటలోనే టీవీలోకి వచ్చేస్తున్న కామెడీ బ్లాక్ బస్టర్.. ఫుల్ నవ్వులు గ్యారెంటీ.. ఏ ఛానెల్ లో చూడొచ్చంటే?

తెలుగు ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. మరో గంటలోనే శాటిలైట్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. సూపర్ హిట్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ టీవీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. 

Published on: Jun 15, 2025, 17:43:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సండేను ఫుల్ ఫన్ డే గా మార్చేందుకు మ్యాడ్ స్క్వేర్ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. ఈ రోజు (జూన్ 15) స్టార్ మాలో ఈ మూవీ టీవీ ప్రీమియర్ కానుంది. మరో గంటలోనే ఈ సినిమా టీవీల్లోకి వచ్చేస్తోంది. ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రిలీజైన మ్యాడ్ మ్యాక్స్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో నవ్వులు చిందిస్తూనే కలెక్షన్ల దుమ్ము రేపింది. 28 మార్చి 2025న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ.

టీవీలోకి బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ (x/Sithara Entertainments)
టీవీలోకి బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ (x/Sithara Entertainments)

టీవీలో ప్రీమియర్

మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈ రోజు టీవీలోకి రాబోతోంది. సాయంత్రం 6.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ సందర్భంగా స్టార్ మా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంది. అప్ డేట్స్ ఇస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ.66 కోట్లు కలెక్ట్ చేసింది. ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ.

ముగ్గురు స్నేహితుల క‌థ‌...

ఇంజినీరింగ్ పూర్త‌యిన మూడేళ్ల త‌ర్వాత డీడీ (సంగీత్ శోభ‌న్‌), అశోక్ (నార్నే నితిన్‌), మ‌నోజ్ (రామ్ నితిన్‌) జీవితాలు మ‌లుపులు తిరుగుతాయి. త‌న ఆస్తుల కోసం అశోక్ కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. డీడీ స‌ర్పంచ్‌గా పోటీ చేయాల‌ని క‌ల‌లు కంటాడు. ఊరి ప్ర‌జ‌ల మెప్పు కోసం అత‌డు చేసే ప‌నుల‌న్నీ మిస్ ఫైర్ అవుతుంటాయి. మ‌నోజ్‌లో ల‌వ్‌లో ఫెయిల‌వుతాడు.

ల‌డ్డు త‌మ‌కు చెప్ప‌కుండా పెళ్లి చేసుకుంటున్నాడ‌ని తెలుసుకొని అత‌డికి పెళ్లికి అటెండ్ అయ్యి స్నేహితుడిని స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని ముగ్గురు అనుకుంటారు. డీడీ, మ‌నోజ్‌, అశోక్ తిక్క ప‌నులు చేసి త‌న పెళ్లిని ఎక్క‌డ చెడ‌గొడ‌తారోన‌ని ల‌డ్డు భ‌య‌ప‌డ‌తాడు.

పెళ్లిలో ట్విస్ట్

మ‌రికొద్ది సేప‌ట్లో తాళిక‌ట్ట‌బోతుండ‌గా డీడీ, మ‌నోజ్‌, అశోక్‌ల‌తో పాటు వ‌చ్చిన ఓ ఫ్రెండ్‌తో ల‌డ్డు పెళ్లిచేసుకోబోయే అమ్మాయి లేచిపోతుంది. పెళ్లి బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి న‌లుగురు ఫ్రెండ్స్ గోవా వెళ‌తారు.

గోవాలో విలువైన పురాత‌న లాకెట్‌ను మ్యాక్స్ గ్యాంగ్ కొట్టేస్తుంది. కానీ మ్యాక్స్ ద‌గ్గ‌ర నుంచి అనుకోకుండా లాకెట్‌ మిస్స‌వుతుంది. డీడీ, మ‌నోజ్‌, అశోక్ ద‌గ్గ‌రే ఆ లాకెట్‌ ఉంద‌ని మ్యాక్స్‌కు తెలుస్తుంది.

ఆ లాకెట్‌ కోసం ల‌డ్డు తండ్రిని కిడ్నాప్ చేస్తాడు మాక్స్‌. ఆ త‌ర్వాత ఏమైంది? మాక్స్ ద‌గ్గ‌ర నుంచి ల‌డ్డు తండ్రిని ముగ్గురు స్నేహితులు ఎలా వినిపించారు? నిజంగానే మాక్స్ లాకెట్‌ ఫ్రెండ్స్ గ్యాంగ్‌ దొంగ‌త‌నం చేశారా? గోవాలో ల‌డ్డు జీవితంలోకి వ‌చ్చిన లైలా ఎవ‌రు అన్న‌దే మ్యాడ్ స్వ్కేర్ మూవీ క‌థ‌.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More