Avunu Nijam Song Lyrics: మహేశ్ బాబు అతడు సినిమా స్టోరీ చెప్పేసే అవును నిజం సాంగ్ లిరిక్స్ ఇవే! అంత మీనింగ్ ఉందా?
Avunu Nijam Song Lyrics In Telugu From Athadu: మహేశ్ బాబు కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాల్లో అతడు కూడా ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, సీన్స్, కామెడీతోపాటు సాంగ్స్ కూడా ఎంతో హిట్ అయ్యాయి. అయితే, అతడు మూవీ మొత్తం స్టోరీని ఒక్క పాటలోనే చెప్పేశారు. ఆ అవును నిజం సాంగ్ లిరిక్స్, వాటి అర్థం ఇక్కడ చూద్దాం.
Avunu Nijam Song Lyrics In Telugu From Athadu: సూపర్ స్టార్ మహేశ్ బాబు-డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా అతడు. 2005లో వచ్చిన అతడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమాలోని డైలాగ్స్, సీన్స్, కామెడీ తెగ అలరించాయి.

ఒక్క పాటలో అతడు స్టోరీ
అందుకే అతడు మూవీకి ఐఎమ్డీబీ నుంచి 8.5 రేటింగ్ వస్తే రొట్టెన్ టొమాటోస్ ఏకంగా 95 శాతం ఫ్రెష్ కంటెంట్ అని తెలిపింది. అలాంటి అతడు మూవీలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఒక్కో పాట ఆడియెన్స్‌ను తెగ అలరించింది. అయితే, అతడు మూవీ స్టోరీని ఓ పాటలోనే చెప్పేశారు మేకర్స్. ఆ పాటే అవును నిజం.. నువ్వంటే నాకిష్టం. మరి అవును నిజం సాంగ్ లిరిక్స్‌ను ఇక్కడ చూద్దాం.
అవును నిజం.. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం.. గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా..
తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ
తెలిసిందే అడగాలా..
అడగందే అనవేలా..
చెవిలో ఇలా.. చెబితే చాలా !
అవును నిజం.. నువ్వంటే నాకిష్టం..
ఈ నిముషం.. గుర్తించా ఆ సత్యం..
కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో
విసిరేస్తున్నా నిను విడి వెనుకకు రాదేమో
నిదరోతున్నా ఎదురై కనబడతావేమో
కదలాలన్నా కుదరని మెలి పెడతావేమో
అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదు కదా..
తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ
తెలిసే ఇలా చెలరేగాలా..
అవును నిజం .. నువ్వంటే నాకిష్టం..
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం..
సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా
తప్పుకో.. కళ్లు మూసుకుని తుళ్లి రాకే నా వెంటా
వప్పుకో.. నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా
నడపదుగా నిను నది వరదా..
తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ
తెలిసే ఇలా.. ముంచెయ్యాలా !!
అవును నిజం.. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం.. గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా..
తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ
తెలిసిందే అడగాలా..
అడగందే అనవేలా..
చెవిలో ఇలా.. చెబితే చాలా !
సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్
మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటకు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు. ప్రముఖ సింగర్స్ సునీత, కేకే అవును నిజం పాటను ఆలపించారు. ఇక ఈ పాటలో అతడు స్టోరీ ఉంది.
లిరిక్స్ మీనింగ్
సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా.. (మర్డర్ విషయంలో ఇరుక్కుపోయి పరిగెడుతున్నా..)
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా.. (ఇలాంటి పరిస్థితుల్లో నాకు ప్రేమ కరెక్ట్ కాదు)
ఎదరేముందో తమరిని వివరములడిగానా.. (నీ జీవితంలో ఏం జరుగుతుందో అని నేను అడగట్లేదు కదా)
ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా.. (నా మనసు ఏం చెబుతుందో వినమని పరుగెడుతూ వస్తాను)
తప్పుకో.. కళ్లు మూసుకుని తుళ్లి రాకే నా వెంటా.. (నా జీవితం ఏం అవుతుందో నాకే తెలీదు. నువ్ గుడ్డిగా నా వైపు రాకు)
వప్పుకో.. నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా.. (నువ్ ఒప్పుకో చాలు నిన్ను నమ్ముకుని ఎక్కడికైనా వచ్చేస్తా)
నడపదుగా నిను నది వరదా.. తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ (నా జీవితం ఒక వరద లాంటిది.. అందులో కొట్టుకుని పోతావ్. జీవితం సాఫిగా సాగదుగా)
తెలిసే ఇలా.. ముంచెయ్యాలా.. (తెలిసి కూడా ముంచేస్తావా నన్ను)
మినిమం ఉంటది
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇది తెలిసి ఈ పాటలో ఇంత మీనింగ్ ఉందా అని నెటిజన్స్ రియాక్ట్ అయితే, పలువురు మీమ్స్ వేస్తున్నారు. "హీరో పరిస్థితిని, దాదాపుగా అతడు స్టోరీని పాటలో చెప్పడం వంటి గొప్పతనం సిరివెన్నెల సీతారామశాస్త్రికే చెందింది", "ఆయన సాహిత్యం అంటే మినిమం ఉంటది" అని నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



