అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ లైఫ్.. రొమాంటిక్ లవ్ స్టోరీగా మహేష్ బాబు మేనల్లుడి కొత్త సినిమా.. డిఫరెంట్ టైటిల్, టీజర్

హీరోగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ టైటిల్ తో, యూత్ లవ్, రొమాంటిక్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజైంది. 

Published on: Jul 12, 2025, 16:06:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అతని కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మూవీ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. శనివారం (జూలై 12) ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రిలీజైంది. అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ లైఫ్, యూత్ లవ్ స్టోరీని ఎంగేజింగ్ గా ఈ మూవీ చెప్పబోతున్నారని టీజర్ చూస్తే స్పష్టమవుతుతోంది.

మహేష్ మేనల్లుడి కొత్త సినిమా (x/Sithara Entertainments)
మహేష్ మేనల్లుడి కొత్త సినిమా (x/Sithara Entertainments)

టైటిల్ ఇదే

అశోక్ గల్లా కొత్త సినిమాకు ‘వీసా: వింటారా సరదాగా’ టైటిల్ పెట్టారు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగనుంది. అమెరికా వెళ్లాలంటే వీసా కష్టాలు పడాల్సిందే. అందుకే సింబాలిక్ గా వీసా పేరును పెట్టి.. వింటారా సరదాగా అనే అర్థాన్నిచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్ ను శనివారం రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

పాడ్ కాస్ట్

‘వెల్ కమ్ టు మా పాడ్ కాస్ట్ సిరీస్ వీసా’ అంటూ హీరో అశోక్ గల్లా టీజర్ లో ఎంట్రీ ఇస్తాడు. ఆంధ్ర, తెలంగాణ తర్వాత మన తెలుగు వాళ్లు బాగా కనెక్ట్ అయిన స్టేట్.. యునైటెడ్ స్టేట్స్ అని డైలాగ్ వేస్తాడు. ఆ తర్వాత మాస్టర్స్ కోసం అమెరికా వచ్చిన తెలుగు స్టూడెంట్ల కష్టాలను ఫన్నీగా చూపించారు. రూ.50 లక్షల కట్నం ఎక్కువగా వస్తుందని మా నాన్న ఇక్కడికి పంపించాడు భయ్యా అనే డైలాగ్ వినిపిస్తోంది.

పబ్ కల్చర్

అమెరికా పబ్ కల్చర్, వెస్టర్న్ సంప్రదాయం, అమ్మాయిలు, హాట్ అందాలు.. ఇలా అక్కడి వాతావరణం చూపించారు. కానీ ఎక్కడైనా తప్పని, తప్పించుకోలేని ప్రాబ్లెం ఒకటుంది.. ప్రేమ అనే డైలాగ్ తో ఈ మూవీ న్యూ ఏజ్ లవ్ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతుందనేలా కనిపిస్తుంది. టీజర్ లో కిస్, బెడ్ సీన్లు కూడా ఉన్నాయి.

ఈ సినిమాలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఉద్భవ్ రఘు డైరెక్టర్. సితారా ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్.

మూడో సినిమా

హీరో మూవీతో డెబ్యూ చేసిన అశోక్ గల్లాకు ఇది మూడో సినిమా. ఆ తర్వాత దేవకి నందన వాసుదేవ సినిమా చేశాడు. వీసా మూవీ అశోక్ గల్లాకు మూడోది. సూపర్ స్టార్ మహేష్ బాబుసోదరి తనయుడే అశోక్ గల్లా. అశోక్ కు మహేష్ బాబు మేనమామ.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More