తండ్రి డైమండ్ రింగ్ కోసం కొడుకుల ఫైట్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ కామెడీ ఎమోషనల్ డ్రామా.. 8.0 ఐఎండీబీ రేటింగ్

ఓటీటీలోకి మలయాళ సినిమా ఒకటి కొత్తగా రిలీజైంది. ఓ వైపు నవ్విస్తూనే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు.. దురాశ వల్ల కలిగే దు:ఖం లాంటి విషయాలను సున్నితంగా చాటిచెప్పింది ఈ మూవీ. ఈ సినిమా ఏది? ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి. 

Jun 24, 2025, 11:57:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ సినిమాలంటేనే డిఫరెంట్ స్టోరీ లైన్ తో వస్తాయనే పేరుంది. థ్రిల్లర్లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను బలంగా చాటుతాయి. అలాగే కడుపుబ్బా నవ్విస్తాయి కూడా. ఇప్పుడు అలాగే నవ్విస్తూనే కన్నీళ్లు తెప్పించే మలయాళ సినిమా ‘పరివార్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 24) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి వజ్రపు ఉంగరం గురించి ఆశ పడే నలుగురు కొడుకుల కథతో ఈ సినిమా వచ్చింది.

ఓటీటీలోకి మలయాళ కామెడీ మూవీ (x)
ఓటీటీలోకి మలయాళ కామెడీ మూవీ (x)

స్ట్రీమింగ్ ఆ ఓటీటీలో

మలయాళ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘పరివార్’ మంగళవారం (జూన్ 24) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళం భాషలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 7న పరివార్ మూవీ థియేటర్లలో రిలీజైంది.

థియేటర్ రెస్పాన్స్

పరివార్ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మానవ సంబంధాలు, కుటుంబ విలువల గురించి ఈ మూవీ చక్కగా చాటి చెప్పింది. అలాగే దురాశ, డబ్బు వ్యామోహం లాంటివి ఎంతటి ప్రమాదకరమో వివరించింది. వీటి కారణంగా మనిషి ఎలా మారతాడనేది చూపించింది. కామెడీతో పాటు మంచి మెసేజ్ ను అందించింది పరివార్ మూవీ. దీంతో థియేటర్లలో ఓ వర్గం ఆడియన్స్ కు నచ్చేసింది.

కథ ఏమిటంటే?

99 ఏళ్ల భాస్కర పిళ్లై మంచం పడతాడు. మరణానికి దగ్గర్లో ఉంటాడు. అతని చేతికి ఉన్న వజ్రపు ఉంగరం గురించి నలుగురు కొడుకులు రంగంలోకి దిగుతారు. ఆ వజ్రపు ఉంగరాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతారు. తండ్రి ఆరోగ్యం కంటే కూడా ఆ డైమండ్ రింగ్ పైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో డైమండ్ రింగ్ కోసం నలుగురు అన్నదమ్ముల మధ్య వచ్చే మనస్ఫర్థలు, గొడవలు కామెడీగానే ఉంటూ ఆలోచింపజేస్తాయి.

దురాశతో

ఆ ఉంగరాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే దురాశ ఆ అన్నదమ్ముల్లో పెరిగిపోతుంది. దురాశతో వెనకా ముందు ఏం ఆలోచించరు. తండ్రి అనే సంగతి కానీ కుటుంబ విలువలు కానీ వాళ్లకు ఆ క్షణంలో అర్థం కావు. మరి చివరకు ఆ రింగ్ ఎవరి సొంతమైంది? తండ్రి మరణించాడా? ఫ్యామిలీ సభ్యుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

పరివార్ సినిమా మంచి కామెడీతో పాటు గొప్ప సందేశాన్ని అందిస్తుంది. కుటుంబ విలువలు, బంధుత్వాలు, డబ్బుపై వ్యామోహం, దురాశ తదితర విషయాలను చాటుతుంది. ఈ సినిమాను ఉల్సవ్ రాజీవ్ డైరెక్ట్ చేశారు. వెటరన్ యాక్టర్లు జగదీష్, ఇంద్రాన్స్, ప్రశాంత్ అలెగ్జాండర్, మోట్టాయి రాజేంద్రన్ తదితరులు నటించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More