...
...
Next Story

బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ రిలీజ్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

మలయాళ యాక్షన్ డ్రామా ఒకటి ఇప్పుడు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. గత నెల 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా వారం తర్వాత తెలుగులోనూ వచ్చింది. ఇప్పటికే బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ప్రస్తుతం బజ్ నెలకొంది.

Published on: Jun 5, 2025, 21:51:12 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. తాజాగా గత నెల 23న వచ్చిన సినిమా నరివెట్ట (Narivetta). ప్రముఖ నటుడు టొవినో థామస్ నటించిన ఈ మూవీ 22 ఏళ్ల కిందట కేరళలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

నరివెట్ట మూవీ స్టోరీ ఏంటంటే?

బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ రిలీజ్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ రిలీజ్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

నరివెట్ట మూవీ మే 23న మలయాళంలో, తర్వాత వారం రోజులకు అదే టైటిల్ తో మే 30న తెలుగులో రిలీజైంది. నక్కల వేట అనే ట్యాగ్‌లైన్ దీనికి పెట్టారు. ఈ సినిమా ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కింది. 2003లో కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముత్తంగలో ఆదివాసీలు చేసిన నిరసన, వాళ్లపై కేరళ పోలీసులు జరిపిన కాల్పుల ఆధారంగా ఈ నరివెట్ట మూవీని తీశారు. ఇందులో టొవినో థామస్ ఓ కానిస్టేబుల్, మరో నటుడు సూరజ్ వెంజరమూడు హెడ్ కానిస్టేబుల్ పాత్రలు పోషించారు.

ప్రభుత్వం తమకు ఇస్తామన్న భూమిని రెండేళ్లయినా కేటాయించకపోవడంతో 2003లో అక్కడి ఆదివాసీలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లపై కాల్పులు జరపడంతో మొత్తం ఐదుగురు చనిపోయారు. అందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన ఆధారంగా నరివెట్ట మూవీని డైరెక్టర్ అనురాజ్ మనోహర్ తీశాడు. టొవినో థామస్, సూరజ్ వెంజరమూడులతోపాటు చేరన్ కూడా ఇందులో నటించాడు.

ఈ సినిమాకు కేరళ బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ.23 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో తెలుగులోనూ వారం ఆలస్యంగా అంటే మే 30న రిలీజ్ చేశారు. పుష్ప మూవీ మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం విశేషం.

నరివెట్ట ఓటీటీ రిలీజ్ డేట్

ఆ లెక్కన ఈ నరివెట్ట కూడా జులై చివరి వారంలో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. త్వరలోనే మేకర్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు. మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఇప్పటికే ఎల్2: ఎంపురాన్, తుడరుం, రేఖాచిత్రమ్, ఆఫీసర్ ఆన్ డ్యూటీలాంటి హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks