ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూశారా.. బ్యాంకునే దోచే అమ్మాయిలు.. ట్విస్టులు చాలానే కానీ..

ఓటీటీలోకి గురువారం (జూన్ 19) తెలుగులో ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఇద్దరు అమ్మాయిలు చేసే బ్యాంకు దోపిడీయే ఇందులో ప్రధాన కథ.

Jun 19, 2025, 13:56:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ పేరు కొల్లా (Kolla). అంటే దోపిడీ అని అర్థం. ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్స్ లో ఒకరిగా నటించిన ఈ సినిమా ఊహకందని ట్విస్టులతో సాగుతుంది.

ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూశారా.. బ్యాంకునే దోచే అమ్మాయిలు.. ట్విస్టులు చాలానే..
ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూశారా.. బ్యాంకునే దోచే అమ్మాయిలు.. ట్విస్టులు చాలానే..

కొల్లా మూవీ స్టోరీ ఏంటంటే?

కొల్లా ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా. 2023లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గురువారం (జూన్ 19) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో రజిషా విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్, వినయ్ ఫోర్ట్, అలెన్సియర్ లోపెజ్ లాంటి వాళ్లు నటించారు. బాబీ సంజయ్ స్టోరీ అందించగా.. సూరజ్ వర్మ డైరెక్ట్ చేశాడు.

ఈ సినిమా ఆనీ (రజిషా), శిల్ప (ప్రియా ప్రకాష్ వారియర్) అనే ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. ఓ ఊళ్లో బ్యూటీ పార్లర్ తెరవాలని ఈ ఇద్దరూ అనుకుంటారు. కానీ వాళ్ల అసలు ప్లాన్ వేరే. పక్కనే ఉన్న బ్యాంకు లక్ష్యంగా వాళ్లు అక్కడ దిగుతారు. ఆ దోపిడీ ప్లాన్ అంతా ఆనీయే చేసుకుంటుంది.

గతంలో తన తండ్రి, అతని స్నేహితుడు ప్రయత్నించి విఫలమైన ప్లాన్ ను ఈసారి ఆమె వేస్తుంది. వాళ్లు ఆ బ్యాంకును ఎలా దోచుకుంటారు? ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి వాళ్లు వేసే ఎత్తులు ఎలాంటివి? చివరికి ఏం జరుగుతుందన్నది ఈ కొల్లా మూవీలో చూడొచ్చు.

కొల్లా మూవీ ఎలా ఉందంటే?

కొల్లా మూవీ నిజానికి ఓ మంచి స్టోరీతో వచ్చింది. కానీ దానిని స్క్రీన్ పై మంచి థ్రిల్లర్ గా ప్రజెంట్ చేయడంలోనే దర్శకుడు సూరజ్ వర్మ తడబడినట్లు కనిపిస్తుంది. కథ, దానికి చెప్పడానికి కావాల్సిన ట్విస్టులు, నటీనటులు ఉన్నా.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ఓ మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ రాదు. దీనికితోడు అసలు ఏమాత్రం క్వాలిటీ లేని బీజీఎం సినిమాను మరింత నీరుగారుస్తుంది.

ఇద్దరు అమ్మాయిలు చేసే బ్యాంకు దోపిడీ.. దానికి అందులోని ఓ అమ్మాయి వేసే స్కెచ్.. ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి ముందు, తర్వాత వేసే ప్లాన్స్.. ఇలా ఓ హైస్ట్ థ్రిల్లర్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నా కూడా రెండు గంటల పాటు ఉత్కంఠగా మూవీని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దోపిడీ కోసం వేసే ప్లాన్, దోపిడీ జరిగిన తీరును చూపించడానికి పెద్దగా సమయం తీసుకోకపోవడం కూడా నిరాశపరుస్తుంది.

దీంతో ప్రేక్షకులను ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐఎండీబీలోనూ 5.5 రేటింగ్ మాత్రమే నమోదైంది. అయితే ఇద్దరు అమ్మాయిలు చేసే బ్యాంకు దోపిడీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మాత్రం ఓసారి ఈ సినిమాను చూడొచ్చు. ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More