...
...
Next Story

మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. ఏడాదిన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో రిలీజై ఏడాదిన్నరపైనే కాగా.. మొత్తానికి ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ వారమే ఈ సినిమా రాబోతోంది.

Published on: Jul 15, 2025, 21:40:00 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళ మూవీ 'అస్త్ర' థియేటర్లలో విడుదలై ఏడాదిన్నరకు పైనే అయింది. మొత్తానికి ఇప్పుడు డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. అమిత్ చకలకల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తేదీ ఇప్పుడు ఖరారైంది.

'అస్త్ర' ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. ఏడాదిన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. ఏడాదిన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ అస్త్ర (Asthra). డిసెంబర్ 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ మూవీ వచ్చే శుక్రవారం (జులై 18) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ కన్ఫమ్ చేసింది.

ఇదే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ త్వరలో ధ్యాన్ శ్రీనివాసన్ 'సూపర్ జిందగీ', అనస్వర రాజన్ 'వ్యాసనాసమేతమ్ బంధుమిత్రాదిగల్' చిత్రాలను కూడా స్ట్రీమింగ్ చేయనుంది. వినయ్ ఫోర్ట్, షరాఫ్ యు దీన్ నటించిన 'సంశయం' కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ప్రస్తుతం 'మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్' సినిమాను మనోరమ మ్యాక్స్‌లో చూడొచ్చు. గత వారం, టొవినో థామస్ పొలిటికల్ థ్రిల్లర్ 'నరివెట్ట' సోనీ లివ్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన 'డిటెక్టివ్ ఉజ్వలన్' నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.

'అస్త్ర' మూవీ గురించి..

కేరళలోని వయనాడ్ జిల్లాలో సుల్తాన్ బతేరి ప్రాంతం ఈ సినిమాకు ప్రధాన నేపథ్యం. 48 గంటల్లో ఒక ముఠా ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపింది. వారు రక్తాన్ని ఉపయోగించి హత్య చేసిన ఇంట్లోని గోడలపై బాణం ఆకారపు గుర్తును వదిలి వెళ్తారు. ఈ కేసును వివిధ పద్ధతులలో దర్యాప్తు చేస్తూ, నేరస్థులను పట్టుకోవడం, నేరం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కనుగొనడం ఈ సినిమాలోని ప్రధానాంశం. ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రను జోషి మాథ్యూ పోషించాడు.

ఆజాద్ అలవిల్ దర్శకత్వం వహించిన 'అస్త్ర' సినిమాలో సుహాసిని కుమరన్, సెంథిల్ కృష్ణ, సుధీర్ కరమణ, కళాభవన్ షాజోన్ కీలక పాత్రలు పోషించారు. రేణు సౌందర్, జయదుష్యంత్, అబూ సలీం, జిజు రాజ్, శ్రీకాంత్ మురళి, మేఘనాథన్, నీనా కురుప్, పరంపర ప్రదీప్ సహాయక నటులుగా ఉన్నారు. ప్రేమ్ కల్లత్, ప్రెనాండ్ కల్లట్ ఈ సినిమాను నిర్మించారు. విను కె మోహన్, జిజు రాజ్ ఈ చిత్రానికి రచన చేశారు. మోహన్ సితార 'అస్త్ర' చిత్రానికి సంగీతం అందించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe