Malayalam OTT: ఈ మలయాళ సినిమా ముఖ్యమంత్రినే కదిలించింది.. ఓటీటీలో చూసి హీరో, హీరోయిన్‌కు ఫోన్ చేసానని షాకింగ్ రివ్యూ

Malayalam OTT: మలయాళ సినీ చరిత్రలోనే రూ. 331 కోట్ల గ్రాస్‌తో 'ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్'గా నిలిచిన చిత్రం 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్'. ఈ సినిమాను తన కుమార్తెతో కలిసి చూసిన కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ సోషల్ మీడియాలో అరుదైన, సుదీర్ఘమైన రివ్యూ పంచుకున్నారు.

Published on: Oct 21, 2026, 14:23:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Malayalam OTT: భారతీయ సినీ పరిశ్రమలో మలయాళ చిత్రాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తక్కువ బడ్జెట్, బలమైన కథాంశంతో వచ్చి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టడంలో మాలీవుడ్ ముందుంటోంది. ఓనమ్ పండుగ సందర్భంగా ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.331.09 కోట్ల భారీ కలెక్షన్లతో మలయాళ సినీ చరిత్రలోనే ఆల్-టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డు సృష్టించిన చిత్రం 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit).

Malayalam OTT: ఈ మలయాళ సినిమా ముఖ్యమంత్రినే కదిలించింది.. ఓటీటీలో చూసి హీరో, హీరోయిన్‌కు ఫోన్ చేసానని షాకింగ్ రివ్యూ
Malayalam OTT: ఈ మలయాళ సినిమా ముఖ్యమంత్రినే కదిలించింది.. ఓటీటీలో చూసి హీరో, హీరోయిన్‌కు ఫోన్ చేసానని షాకింగ్ రివ్యూ

ఓటీటీలో చూసి.. టీమ్‌ను అభినందించి..

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఇటీవల కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (VD Satheesan) చూశారు.

సినిమా ముగిసిన వెంటనే ఆయన పరవశించిపోతూ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన అరుదైన రివ్యూ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. దర్శకుడు గిరీష్ ఏడీ, నటుడు సంగీత్ ప్రతాప్‌లను ఫోన్‌లో అభినందించిన సీఎం.. హీరో నివిన్ పౌలీ, హీరోయిన్ మమితా బైజులకు ఫోన్ చేసినా కలవలేదని పేర్కొన్నారు.

"నా బాల్యం గుర్తొచ్చింది.. ఏ ఒక్క క్షణం బోర్ కొట్టలేదు!"

సాధారణంగా సినిమాలకు రివ్యూలు రాయని సీఎం సతీశన్, ఈ సినిమా తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని రాసుకొచ్చారు. "నిరంతరం ఉండే బిజీ షెడ్యూల్ వల్ల నెలకు కనీసం ఒక సినిమా అయినా చూసే నా అలవాటు ఆగిపోయింది. చాలా కాలం విరామం తర్వాత నిన్న రాత్రి నా కూతురు, ఆమె స్నేహితురాలితో కలిసి 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' సినిమాను ఒకే సిట్టింగ్ లో చూశాను. సినిమా చూస్తున్నంత సేపు నాకు ఏ ఒక్క క్షణం కూడా బోర్ కొట్టలేదు. నా చిన్ననాటి రోజులు, ఆనాటి గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషులు, వారి మధ్య ఉండే నిర్మలమైన అనుబంధాలు, అమాయకపు ప్రేమలు నా కళ్ల ముందు మెదిలాయి" అని పేర్కొన్నారు.

అంతేకాకుండా.. "నన్ను పూర్తిగా కట్టిపడేసిన చిత్రమిది. సినిమా పూర్తయ్యాక, ఇంత మంచి సినిమాను చూడటానికి నేను ఎందుకు ఇంత సమయం తీసుకున్నానా అనిపించింది. కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, ఒకటి రెండు సీన్లలో కనిపించిన నటులు కూడా తమ నటనతో గుర్తుండిపోయారు. నవ్వించడంతో పాటు కొన్నిచోట్ల మనసును తడిమేలా ఉంది. ఇదొక అద్భుతమైన టీమ్‌వర్క్" అని ప్రశంసల వర్షం కురిపించారు.

హీరో, హీరోయిన్లకు ఫోన్ కలవలేదు

సినిమా చూసిన తర్వాత తన అనుభూతిని పంచుకోవడానికి నివిన్ పౌలీ, మమితా బైజులతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు సీఎం వెల్లడించారు.

"నేను సాధారణంగా సినిమాలు చూశాక రివ్యూలు రాయను. కానీ ఈ సినిమా నన్ను ఎంతగానో రీఫ్రెష్ చేయడంతో నా అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను. వెంటనే దర్శకుడు గిరీష్ ఏడీ, నటుడు సంగీత్ ప్రతాప్‌లకు ఫోన్ చేసి అభినందనలు తెలిపాను. అయితే హీరో నివిన్ పౌలీ, హీరోయిన్ మమితా బైజులకు ఫోన్ చేస్తే లైన్ కలవలేదు. వీరితో పాటు 'గ్లిక్సన్' పాత్ర చేసిన నటుడు నన్ను బాగా ఆకట్టుకున్నాడు. చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు" అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.

సీఎం స్వయంగా పోస్ట్ చేసిన ఈ స్పందనపై దర్శకుడు గిరీష్, నివిన్ పౌలీ, మమితా బైజు స్పందిస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

వయసుతో సంబంధం లేని ప్రేమకథ.. బాక్సాఫీస్ సునామీ

'ప్రేమలు' (Premalu) చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఒక కాలేజీ విద్యార్థినికి, వయసులో బాగా పెద్దవాడైన తన పొరుగుంటి వ్యక్తికి మధ్య చిగురించిన విలక్షణమైన ప్రేమకథ ఆధారంగా రూపుదిద్దుకుంది. సామాజిక అడ్డంకులు, విమర్శలను దాటుకుంటూ వారి ప్రేమ ఎలా గెలిచిందనేది అత్యంత సహజంగా, హాస్యభరితంగా చూపించారు.

థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం ఓటీటీలోనూ అదే స్థాయిలో వ్యూయర్షిప్ సాధిస్తూ డిజిటల్ ప్రేక్షకులనూ అలరిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More