ఓటీటీల్లోకి ఈ వారం 3 మలయాళ చిత్రాలు.. సూపర్ హిట్ యాక్షన్ మూవీ తెలుగులోనూ..: వివరాలివే

ఓటీటీల్లోకి ఈ వారం మూడు మలయాళ చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో ఒకటి సూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ ఉంది. ఓ మ్యూజికల్ డ్రామా సినిమా కూడా అడుగుపెట్టనుంది. మరో చిత్రం కూడా రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Jul 7, 2025, 16:17:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల్లో కొత్త మలయాళ చిత్రాలు చూడాలనుకుంటున్నారా.. అయితే, ఈ వారం మూడు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చేయనున్నాయి. టొవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నరివెట్ట’ ఈ వారమే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మరో రెండు మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ జూలై రెండో వారం ఓటీటీల్లోకి రానున్న మూడు మలయాళ సినిమాలు ఏవంటే..

ఓటీటీల్లో ఈ వారం 3 మలయాళ చిత్రాలు.. సూపర్ హిట్ థ్రిల్లర్ తెలుగులోనూ..: వివరాలివే
ఓటీటీల్లో ఈ వారం 3 మలయాళ చిత్రాలు.. సూపర్ హిట్ థ్రిల్లర్ తెలుగులోనూ..: వివరాలివే

నరివెట్ట

మలయాళ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ ‘నరివెట్ట’ ఈ శుక్రవారం (జూలై 11) సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ విషయంపై సోనీలివ్ అధికారిక ప్రకటన చేసింది.

నరివెట్ట చిత్రం మే 23వ తేదీన థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ దక్కించుకొని హిట్‍గా నిలిచింది. రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.30కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. తెలుగులోనూ ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది.

నరివెట్ట మూవీకి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో పోలీస్ కానిస్టేబుల్‍గా టొవినో నటించారు. సూరజ్ వెంజరమూడు కూడా ఓ ముఖ్యమైన రోల్ చేశారు. ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ మ్యూజిక్ ఇచ్చారు. నరివెట్టను సోనీలివ్‍లో జూలై 11 నుంచి చూసేయవచ్చు.

మూన్‍వాక్

మూన్‍వాక్ సినిమా రేపు (జూలై 8) జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మ్యూజికల్ డ్రామా చిత్రంలో సిబి కుట్టప్పన్, అనునాథ్, రిషి కైనిక్కర, సిద్ధార్ధ్, సుజిత్ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది. మైకేల్ జాక్సన్‍లా డ్యాన్స్ చేస్తూ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓ యువకుల గ్రూప్ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. వినోద్ ఏకే దర్శకత్వం వహించిన మూన్‍వాక్ మూవీ మే 30వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇక జూన్ 8న జియోహాట్స్టార్ ఓటీటీలో అడుగుపెట్టనుంది.

మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్

మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’ జూలై 11వ తేదీన మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, ఇంద్రజిత్ సుకుమారన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా గతేడాది మేలో థియేటర్లలో విడుదలైంది. సుమారు 13నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ మూవీకి దీపు కరుణాకరన్ దర్శకత్వం వహించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More