తుడరుమ్ నచ్చిందా.. అయితే ఓటీటీలోని ఈ టాప్ 5 మలయాళం రివేంజ్ థ్రిల్లర్ మూవీస్‌ను మిస్ కాకుండా చూడండి
తుడరుమ్ మూవీ మీకు నచ్చిందా? అయితే ఇలాంటివే ఓటీటీలో ఉన్న మలయాళం రివేంజ్ థ్రిల్లర్ సినిమాలను మిస్ కాకుండా చూడండి. గత కొన్నేళ్లలో ఇలాంటివి ఎన్నో మూవీస్ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి.
మలయాళం రివేంజ్ థ్రిల్లర్ మూవీ తుడరుమ్ (Thudarum) శుక్రవారమే (మే 30) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్ల కంటే కూడా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయిన తర్వాతే ఈ సినిమాకు ఎక్కువ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మరి మీకు కూడా ఈ సినిమా నచ్చితే.. ఇలాంటివే ఓటీటీలో చూడాల్సిన మలయాళం రివేంజ్ థ్రిల్లర్ సినిమాలేవో తెలుసుకోండి.

పని - సోనీ లివ్ ఓటీటీ
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన అసలుసిసలు రివేంజ్ థ్రిల్లర్ మూవీ పని (Pani). ప్రముఖ నటుడు జోజు జార్జ్ డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. త్రిసూర్ లోని పేరుగాంచిన ఫ్యామిలీల్లో ఒకటైన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఇద్దరు కుర్రాళ్లు సృష్టించే విధ్వంసం.. దానికి హీరో తీసుకునే ప్రతీకారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఐడెంటిటీ - జీ5 ఓటీటీ
టొవినో థామస్, త్రిష నటించిన ఈ మూవీ ఏడాది మొదట్లో రిలీజైంది. ఓ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్, అందులో సాక్షిగా ఉన్న జర్నలిస్ట్ కలిసి ఓ స్కెచ్ ఆర్టిస్ట్ సాయం కోరతారు. కానీ అక్కడే సినిమా మరో మలుపు తిరుగుతుంది. తన చెల్లితోపాటు అలాంటి మరెందరికో అన్యాయం చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునే వ్యక్తితో వాళ్లు చేతులు కలుపుతారు. ఈ మూవీలోని ట్విస్టులు థ్రిల్ పంచుతాయి. జీ5 ఓటీటీలో తెలుగులోనూ చూడొచ్చు.
తలవన్ - సోనీ లివ్ ఓటీటీ
తలవన్ కూడా మరో రివేంజ్ థ్రిల్లర్ మూవీయే. ఇది ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంది. అసలు ఒకరంటే ఒకరు క్షణం పడని సీఐ, ఎస్ఐలు తర్వాత ఓ హత్య కేసును కలిసి ఎలా పరిష్కరిస్తారు? అందులోని రివేంజ్ కోణం ఏంటన్నది ఈ మూవీలో చూడొచ్చు. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
అంజామ్ పతీరా - ప్రైమ్ వీడియో
ప్రముఖ నటుడు కుంచకో బొబన్ నటించిన సినిమా ఇది. పోలీసులనే లక్ష్యంగా చేసుకుంటూ తనకు జరిగిన అన్యాయానికి రివేంజ్ తీసుకునే ఓ సీరియల్ కిల్లర్ స్టోరీ ఇది. ఇలాంటి కేసును క్రిమినాలజిస్ట్ అయిన అన్వర్ (కుంచకో) ఎలా ఛేదిస్తాడన్నది ఇందులో చూడొచ్చు. తెలుగులో మిడ్‌నైట్ మర్డర్స్ పేరుతో యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఐ యామ్ కాథలన్ - ప్రైమ్ వీడియో
ప్రేమలు ఫేమ్ నటుడు నస్లేన్, డైరెక్టర్ గిరీష్ ఏడీ కాంబినేషన్ లో వచ్చిన రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఐ యామ్ కాథలన్. తన రివేంజ్ కోసం టెక్నాలజీనే వాడుకునే ఓ యువకుడి కథ ఇది. హ్యాకింగ్ ద్వారా అతడు తన ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ లలో ఉంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



