వారంలోనే తెలుగులో మరో ఓటీటీలోకి వస్తున్న మలయాళం బ్లాక్‌బస్టర్ స్పోర్ట్స్ కామెడీ మూవీ.. ఇంకా చూశారా లేదా?
మలయాళం బ్లాక్‌బస్టర్ స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా మూవీ ఓ ఓటీటీలోకి వచ్చిన వారంలోనే మరో ఓటీటీలోకి వస్తోంది. అది కూడా తెలుగు ఆడియోతో కావడం విశేషం. ఈ సినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ఓటీటీలో అంతకుమించిన రెస్పాన్స్ వస్తోంది.
ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ ఆలప్పుళ జింఖానా (Alappuzha Gymkhana). ఈ సినిమా గత గురువారం (జూన్ 12) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ మరో ఓటీటీలోకి కూడా వస్తుండటం విశేషం.

ఆలప్పుళ జింఖానా ఓటీటీ
ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ నటించిన మూవీ ఆలప్పుళ జింఖానా. విషు సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. రెండు నెలల తర్వాత ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చింది.
ఇక ఇప్పుడు తెలుగు వెర్షన్ వచ్చే శుక్రవారం (జూన్ 20) నుంచి ఆహా వీడియో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. దీంతో రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ మూవీ తెలుగు వెర్షన్ ను చూసే అవకాశం ఇక్కడి ప్రేక్షకులకు దక్కనుంది. ఈ సినిమా ఆహాలోకి కూడా వస్తే.. మరింత మంది ప్రేక్షకుల దగ్గరకు చేరనుంది.
ఆలప్పుళ జింఖానా ఎలా ఉందంటే?
ఆలప్పుళ జింఖానా మూవీ ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. ఇదో స్పోర్ట్స్ కామెడీ మూవీ. ఖాలిద్ రెహమాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఐదుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిలై.. ఉన్నత చదువుల కోసం స్పోర్ట్స్ కోటాలో సీట్లు సాధించాలనుకుని బాక్సింగ్ ను ఎంచుకుంటారు వీళ్లు. అదే వాళ్ల జీవితాలను మలుపు తిప్పుతుంది.
స్థానికంగా ఉన్న ఆలప్పుళ జింఖానాలో బాక్సింగ్ కోచింగ్ కోసం చేరతారు. మొదట జిల్లా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచి కాలేజీలో సీట్లు సంపాదించాలని ఆరాటపడతారు. మరి వాళ్ల కల నెరవేరిందా లేదా అన్నది ఈ మూవీలో చూడాలి.
డైలాగులు, నటన, మ్యూజిక్.. హైలైట్
ప్రేమలు ఫేమ్ నస్లేన్ గఫూర్ తోపాటు సందీప్ ప్రదీప్, లూక్మన్ అవరన్, గణపతి, అనఘ రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరణ్ లాంటి వాళ్లు నటించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అయినా.. బాక్సింగ్ కంటే కామెడీతోనే ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. డైలాగులు అదిరిపోయాయి. ఇక్కడి ప్రేక్షకులను బాగా ఆకర్షించేలా తెలుగులో డైలాగులు రాశారు. అదే స్థాయిలో డబ్బింగ్ కూడా చెప్పారు.
నస్లేన్ తోపాటు మిగిలిన నటీనటులందరూ చాలా సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. విష్ణు విజయ్ అందించిన మ్యూజిక్, బీజీఎం సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. రెండు గంటల 20 నిమిషాల పాటు హాయిగా నవ్వించే మూవీ ఈ ఆలప్పుళ జింఖానా. సోనీ లివ్ ఓటీటీలో వెంటనే చూసేయండి. ఒకవేళ ఆ సబ్‌స్క్రిప్షన్ లేకపోతే వచ్చే శుక్రవారం (జూన్ 20) వరకు ఆగితే ఆహా వీడియోలోనూ చూడొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



