...
...
Next Story

మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ మొదలైంది.. ఐఎండీబీలో 8.3 రేటింగ్

మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం (ఆగస్టు 21) ఈటీవీ విన్ ఓటీటీలోకి ఈ మూవీ అడుగుపెట్టింది. ఐఎండీబీలో 8.3 రేటింగ్ సాధించిన ఈ సినిమాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి.

Published on: Aug 21, 2025, 16:14:20 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళం థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడో మలయాళం కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురువారం (ఆగస్టు 21) ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా పేరు సూత్రవాక్యం (Soothravakyam). ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉండటం విశేషం.

సూత్రవాక్యం ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ మొదలైంది.. ఐఎండీబీలో 8.3 రేటింగ్
మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ మొదలైంది.. ఐఎండీబీలో 8.3 రేటింగ్

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ సూత్రవాక్యం. ఇదో డిఫరెంట్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ గురువారం (ఆగస్టు 21) ఈటీవీ విన్ ఓటీటీలోకి తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది.

“ప్రతి కుటుంబం ఓ రహస్యాన్ని దాచి పెడుతుంది.. కానీ నిజం బయటపడినప్పుడు ఏం జరుగుతుంది? సూత్రవాక్యం ఇప్పుడు కేవలం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ తెలుగు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

సూత్రవాక్యం మూవీ గురించి..

సూత్రవాక్యం మూవీ జూన్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీని యూజీన్ జోస్ చిరమ్మెల్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కండ్రాగుల నటించారు. ఈ సినిమాలో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాకో కనిపించాడు. అతనికి ఓ మంచి పోలీసుగా పేరుంటుంది.

అంతేకాదు తన పోలీస్ స్టేషన్ లోనే స్థానిక 11వ తరగతి పిల్లలకు ఫ్రీగా ట్యూషన్లు చెబుతుంటాడు. అయితే అతని రూపంలో అక్కడే ట్యూషన్లు చెప్పే నిమిష (విన్సీ అలోషియస్)కు పోటీ ఎదురవుతుంది. ఆమె దగ్గరకు వచ్చే పిల్లలు కూడా క్రిస్టో దగ్గరికి వెళ్తుంటారు. అయితే క్రిస్టో దగ్గరికి వచ్చే ఆర్య (అనఘ) అనే అమ్మాయికి తన అన్న వివేక్ (దీపక్ పరంబోల్) వేధింపులు మొదలవుతాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe