మలయాళం థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి.. మంజుమ్మెల్ బాయ్స్ హీరో నటించిన సినిమా

మలయాళం థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. మంజుమ్మెల్ బాయ్స్ మూవీ హీరో శ్రీనాథ్ భాసి లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉంది.

Jun 12, 2025, 21:22:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం థ్రిల్లర్ మూవీ ఆజాదీ (Azadi) గత నెలలో థియేటర్లలో రిలీజైనా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. హత్య కేసులో ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్న ఓ మహిళ తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

మలయాళం థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి.. మంజుమ్మెల్ బాయ్స్ హీరో నటించిన సినిమా
మలయాళం థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి.. మంజుమ్మెల్ బాయ్స్ హీరో నటించిన సినిమా

ఆజాదీ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం థ్రిల్లర్ మూవీ ఆజాదీ మే 23న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను జూన్ 27 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కు ముందే డిజిటల్ హక్కులను ఈ ఓటీటీ సొంతం చేసుకుంది.

మలయాళం ఇండస్ట్రీలో ఇలా జరగడం చాలా అరుదు. చాలా వరకు మలయాళం సినిమాలు థియేటర్లలో రిలీజైన తర్వాతే డిజిటల్ పార్ట్‌నర్ ను కన్ఫమ్ చేస్తాయి. కానీ ఆజాదీ మూవీని మనోరమ మ్యాక్స్ ముందే దక్కించుకుంది.

ఆజాదీ మూవీ గురించి..

ఆజాదీ మూవీని జో జార్జ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో మంజుమ్మెల్ బాయ్స్ మూవీ హీరో శ్రీనాథ్ భాసితోపాటు వాణీ విశ్వనాథ్, లాల్, సైజు కురుప్, రవీనా రవిలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ కొట్టాయం మెడికల్ కాలేజీలోనే ఎక్కువగా ఉంటుంది. గంగా అనే ఓ మహిళ చుట్టూ తిరిగే కథ. గర్భవతి అయిన ఆమె ఓ రాజకీయ నేత కొడుకు హత్య కేసులో జైలుకు వెళ్తుంది.

అయితే ప్రసవం కోసం ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. అక్కడి నుంచే ఆమెను తప్పించేందుకు భర్త ప్లాన్ చేస్తాడు. అయితే వాళ్ల గతం ఆ ప్లాన్ ను దెబ్బ తీస్తుంది. వాళ్ల ప్రత్యర్థులు ఆ హాస్పిటల్లోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి వాళ్లు తప్పించుకోవడం కాదు కదా.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే కష్ట పడాల్సి వస్తుంది. మరి ఆ భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుంటారా లేదా అన్నదే ఈ ఆజాదీ మూవీ స్టోరీ.

గత నెలలో టొవినో థామస్ నటించిన నరివెట్టతో కలిసి థియేటర్లలో రిలీజైందీ ఆజాదీ మూవీ. అయితే బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More