...
...
Next Story

మలయాళం థ్రిల్లర్ మూవీ.. యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్.. క్లైమ్యాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు

ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆసిఫ్ అలీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్టును అస్సలు ఊహించలేరు. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉండటం విశేషం.

Published on: Jun 3, 2025, 15:59:35 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మీరు మలయాళం థ్రిల్లర్ సినిమాలకు అభిమానులా? అయితే యూట్యూబ్‌లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు. తెలుగులో చూడాలనుకుంటే సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 6.2 రేటింగ్ ఉన్న ఈ థ్రిల్లర్ సినిమా మూడేళ్ల కిందట థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు విజయం సాధించింది.

ఇన్నలే వరే మూవీ స్టోరీ ఏంటంటే?

మలయాళం థ్రిల్లర్ మూవీ.. యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్.. క్లైమ్యాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు
మలయాళం థ్రిల్లర్ మూవీ.. యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్.. క్లైమ్యాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు

యూట్యూబ్ లో మలయాళంతోపాటు హిందీలోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు ఇన్నలే వరే (Innale Vare). అంటే తెలుగులో నిన్నటి వరకు అని అర్థం. జిస్ జాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, నిమిషా సజయన్ లాంటి వాళ్లు నటించారు. ఇదో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. సినిమా నటుడు ఆది శంకర్ (ఆసిఫ్ అలీ) వరుస పరాజయాల కారణంగా అప్పుల పాలై కష్టాల్లో ఉంటాడు.

ఆ అప్పులు తీర్చి మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తుంటాడు. దీనికితోడు ఓవైపు తాను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి, మరోవైపు సహ నటితో శారీరక సంబంధాలతోనూ ఇబ్బంది పడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో షాని (నిమిషా సజయన్) అనే ఓ అమ్మాయి ఓరోజు అతనికి రోడ్డుపై లిఫ్ట్ ఇచ్చి తన అభిమానిని అని చెబుతూ ఇంటికి తీసుకెళ్లి ఓ రూమ్ లో అతన్ని బంధిస్తుంది. ఓ హ్యాకర్, ఈ కుట్రలో భాగం అయిన శరత్ (ఆంటోనీ వర్గీస్) సాయంతో అతని ఫోన్ ను హ్యాక్ చేసి.. ఆదికి సంబంధించిన వ్యక్తులను బోల్తా కొట్టిస్తుంటారు.

తమకు రూ.1.5 కోట్లు ఇస్తేనే నిన్ను విడిచిపెడతామని ఆదికి వాళ్లు స్పష్టం చేస్తారు. అసలు ఆ ఇద్దరు ఎవరు? వాళ్లకు ఆది శంకర్ కు అసలు సంబంధం ఏంటి? వాళ్ల బారి నుంచి ఆది తప్పించుకుంటాడా? సాదాసీదా కిడ్నాప్ లా అనిపించే ఈ సినిమాలో క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి అన్నది ఇన్నలే వరే మూవీలో చూడొచ్చు.

ఇన్నలే వరే ఎలా ఉందంటే?

2022లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, హిందీ వెర్షన్లయితే యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. మరీ అంత థ్రిల్ చేయకపోయినా.. ఈ మూవీ చూసిన తర్వాత పెద్దగా నిరాశ మాత్రం కలగదు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe