ఒకేసారి రెండు ఓటీటీల్లోకి మలయాళం థ్రిల్లర్ మూవీ.. థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత..
మలయాళం థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. అది కూడా ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి కావడం విశేషం. మరి ఆ మూవీ ఏంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
మలయాళ థ్రిల్లర్ మూవీ ‘కర్ణిక’ థియేటర్లలో విడుదలైన పది నెలల తర్వాత, శనివారం (జూన్ 7) నుండి ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

'కర్ణిక' ఓటీటీ స్ట్రీమింగ్
ప్రియాంక నాయర్ ప్రధాన పాత్రలో నటించిన కర్ణిక మూవీ జూన్ 7 అర్ధరాత్రి 12 గంటల నుండి మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీప్లాట్‌ఫామ్‌లలో విడుదలైంది. విదేశాల్లోని ప్రేక్షకులకు ఈ సినిమా సింప్లీ సౌత్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
2024లో థియేటర్లలో విడుదలైనప్పుడు 'కర్ణిక' మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే, ఇప్పుడు ఓటీటీ విడుదల తర్వాత ఈ థ్రిల్లర్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ మధ్యే మలయాళ మూవీస్ 'బిగ్ బెన్', 'హంట్', 'ఊసెప్పెంటే ఒసియతు', 'అం అ:', 'మరణమాస్' వంటి మలయాళ మూవీస్ వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చాయి. నస్లెన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా 'ఆలప్పుర జింఖానా' జూన్ 13 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
కర్ణిక మూవీ గురించి..
మలయాళం మూవీ ‘కర్ణిక’ 2024 ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉన్నప్పటికీ, థియేటర్లలో విడుదలైన తర్వాత మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి ఒక రచయిత్రి పయ్యవూర్ గ్రామంలో విచిత్రమైన పరిస్థితుల్లో ఆమెపై దాడి జరుగుతుంది. ఈ దాడి కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అన్ని ఆధారాలు పూవరసి మణ అనే పూర్వీకుల ఇంటి వైపు చూపుతాయి.
ఈ లోపు ఆ రచయిత గతంలో ఈ ఇంటిని సందర్శించి కొన్ని భయంకరమైన రహస్యాలను కనుగొన్నట్లు తెలుస్తుంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి, ఈ రచయితకు, ఆ దెయ్యాల ఇంటికి మధ్య ఉన్న సంబంధాన్ని అవి వెల్లడిస్తాయి. సినిమా మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది.
'కర్ణిక'లో ప్రియాంక నాయర్‌తో పాటు వియాన్ మంగళశేరి, టీజీ రవి, క్రిస్ వేణుగోపాల్, ఆధవ్ రామచంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. అరుణ్ వెంపల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్ర స్క్రీన్‌ప్లేను కూడా దర్శకుడే రాశారు. ఏరీస్ టెలికాస్టింగ్ ఆధ్వర్యంలో అభిని సోహన్ దీనిని నిర్మించారు. అరుణ్ వెంపల, జ్యోతిష్ జోసెఫ్ ఎడిటర్లుగా, అశ్వంత్ మోహన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper













