Malayalam Thriller: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెన్షేషన్.. కళ్లు చెదిరే ట్విస్టులు.. చూసేందుకు ఈ 5 కారణాలు
Malayalam Thriller: సోనీ లివ్ (SonyLIV) వేదికగా అక్టోబర్ 9, 2026న విడుదలైన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఐస్' (Eyes) ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహిళల వెం పడే ఆకతాయిలు (Stalking), అబ్సెషన్ వంటి తీవ్రమైన నేరాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతోంది.
Malayalam Thriller: సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న తాజా మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఐస్' (Eyes). మహిళలను వెంబడించడం (స్టాకింగ్), ప్రేమ పేరుతో వారిపై అకృత్యాలకు పాల్పడటం వంటి నేరాలను అరికట్టేందుకు ఒక ఐదుగురు సభ్యుల బృందం చేసే పోరాటమే ఈ సిరీస్ కథాంశం.

ఐస్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?
నేరస్థులను పర్యవేక్షించి, వారి ప్రొఫైల్స్ తయారు చేసి, క్రైమ్ జరగకముందే ఆపేందుకు 'ఐస్' అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఈ బృందం ఉపయోగిస్తుంది. ఇందులో పోలీస్ అధికారులు టీనా, జస్టిన్; సాఫ్ట్‌వేర్ డెవలపర్ విద్య; మానసిక ఆరోగ్య నిపుణులు ఆయేషా, తన్వి సభ్యులుగా ఉంటారు.
ఒక హీరోయిన్‌ను వెంబడించే ఫోటోగ్రాఫర్, సూపర్ మార్కెట్ ఉద్యోగిని వేధించే ప్రియుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ శాడిజం, పారిపోయి పెళ్లి చేసుకున్న ఒక యువతి ఎదుర్కొనే గృహహింస.. ఈ నాలుగు కేసుల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.
కనీ కుసృతి, నిఖిలా విమల్, శృతి రామచంద్రన్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌ను మలయాళ సినిమా అభిమానులు ఎందుకు చూడాలో తెలిపే 5 ముఖ్యమైన కారణాలు మీకోసం.
1. అంతా నటీమణులే..
ఈ వెబ్ సిరీస్ ప్రధానంగా మహిళా పాత్రల చుట్టూ తిరుగుతుంది. ప్రతి పాత్రకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు. బాధితులు, నేరస్థులు, చట్టాన్ని అమలు చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో అంతర్గత పోరాటాలు, లోపాలు ఉంటాయి. ఈ పాత్రలు మన నిజ జీవితంలో కనిపించే, మన చుట్టూ ఉండే వ్యక్తుల్లాగే ఎంతో సహజంగా, రియలిస్టిక్‌గా అనిపిస్తాయి.
2. స్టాకింగ్‌పై సరికొత్త కోణం
స్టాకింగ్ (వెంబడించడం), అబ్సెషన్ అనే అంశాలను దర్శకుడు ఎంతో కొత్తగా డీల్ చేశారు. ఈ సిరీస్ ప్రారంభమే ఒక షాకింగ్ ఎలిమెంట్‌తో మొదలై, కథపై ఆసక్తిని పెంచుతుంది. స్క్రీన్‌ప్లే అంతా నాన్-లీనియర్ పద్ధతిలో సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ ఒక ప్రత్యేకమైన కేసుతో మొదలై, మునుపటి కేసులతో ముడిపడుతూ ముందుకు వెళ్తుంది. నెమ్మదిగా మొదలైనప్పటికీ రానురాను ట్విస్టులతో సిరీస్ వేగం పుంజుకుంటుంది.
3. మను అశోకన్ బ్రిలియంట్ డైరెక్షన్
దర్శకుడు మను అశోకన్ (Manu Ashokan) తన డైరెక్షన్‌తో సిరీస్‌ను ఎక్కడా పక్కదారి పట్టనీయకుండా అద్భుతంగా కంట్రోల్ చేశారు. థ్రిల్లర్‌కు కావాల్సిన వాతావరణాన్ని ఎంతో సమర్థవంతంగా సృష్టించారు. వయొలెన్స్, ఎమోషన్స్‌ను చాలా పరిణతితో హ్యాండిల్ చేశారు. అతిశయోక్తి లేకుండా, సాంకేతిక అంశాలను ప్రేక్షకులకు నమ్మశక్యంగా చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
4. అదరగొట్టిన నటీనటులు
ఈ వెబ్ సిరీస్‌లో ప్రతీ నటీనటులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా కనీ కుసృతి, మానసిక నిపుణులుగా, యాప్ డెవలపర్లుగా నిఖిలా, శృతి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బృందంలో ఏకైక పురుషుడిగా ప్రభు తనదైన మార్క్ చూపించారు.
నెగిటివ్ షేడ్స్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్‌గా దేవ్ మోహన్ (Dev Mohan) నటన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక జాఫర్ ఇడుక్కి (Jaffer Idukki) తనదైన భయానకమైన నటనతో హైలైట్ గా నిలిచారు. ఫోటోగ్రాఫర్ పాత్రలో వాసు బోస్ అదరగొట్టారు.
5. ఉత్కంఠ రేపే క్లైమాక్స్
'ఐస్' సిరీస్ చివరి ఎపిసోడ్ వీక్షకులకు ఒక మంచి థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. నాలుగు విభిన్న కేసుల స్టోరీలన్నీ ఆఖరి ఎపిసోడ్‌లో అద్భుతంగా కలుస్తాయి. సస్పెన్స్, మర్డర్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. బాధితులకు న్యాయం జరిగి కథ సుఖాంతమైంది అనుకునేలోపే.. ఊహించని విధంగా వచ్చే ఒక ఫోన్ కాల్ కథ ఇంకా ముగియలేదని హింట్ ఇస్తుంది.
సెకండ్ సీజన్‌పై భారీ అంచనాలను పెంచుతూ ఈ థ్రిల్లర్ ముగుస్తుంది. మంచి సస్పెన్స్ కోరుకునే వారు సోనీ లివ్‌లోని ఈ సిరీస్‌ను కచ్చితంగా బింజ్-వాచ్ చేయొచ్చు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


