...
...
Next Story

ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్ లో అదుర్స్.. జియోహాట్‌స్టార్‌ టాప్-5 ఫిల్మ్స్ ఇవే

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో దూసుకెళ్తోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మలయాళ ఫస్ట్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో టాప్-5 ట్రెండింగ్ ఫిల్మ్స్ పై ఓ లుక్కేయండి.

Published on: Jun 22, 2025, 20:18:45 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 దూసుకెళ్తోంది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో, ఉత్కంఠ రేపే సీన్స్ తో అదరగొడుతున్న ఈ సిరీస్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ సిరీస్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ సిరీస్.

టాప్-5 ఇవే

ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ (x/JioHotstar Malayalam)
ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ (x/JioHotstar Malayalam)

జియోహాట్స్టార్ ఓటీటీలో డిఫరెంట్ వెబ్ సిరీస్, సినిమాలు అదరగొడుతున్నాయి. తెలుగులో టాప్-5లో రెండు వెబ్ సిరీస్ లు, మూడు సినిమాలున్నాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, శుభం, పడక్కలమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, మెడికల్ డ్రామా సిరీస్ హార్ట్ బీట్ 2.. వరుసగా టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, హార్ట్ బీట్ రెండు వెబ్ సిరీస్. శుభం, పడక్కలమ్, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలు.

హిందీలో ఇలా

హిందీలో లీగల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. కేసరి ఛాప్టర్ 2, కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, గేమ్ ఆఫ్ ది త్రోన్స్, టెర్రిఫయర్ 2 వరుసగా టాప్-5 స్థానాల్లో ఉన్నాయి. కోర్టు డ్రామా థ్రిల్లర్ క్రిమినల్ జస్టిస్ ఆడియన్స్ ను అలరిస్తోంది.

మెడికో డ్రామా

తమిళంలో హార్ట్ బీట్ సీజన్ 2 నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ మెడికో డ్రామా అదరగొడుతోంది. తమిళ్ లో హార్ట్ బీట్ సీజన్ 2 తర్వాత కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, ఆఫీస్, టూరిస్ట్ ఫ్యామిలీ, పడక్కలమ్ వరుసగా టాప్ 5లో ఉన్నాయి. మలయాళంలో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, పడక్కలమ్, తుడరుమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, శుభం వరుసగా టాప్-5లో ఉన్నాయి.

కన్నడలో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, ఓ కుకింగ్ షో, పడక్కలమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 వరుసగా టాప్-5లో స్ట్రీమ్ అవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, టూరిస్ట్ ఫ్యామిలీ, శుభం, క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 హవా కొనసాగిస్తున్నాయి. మరి వీటిలో మీరు ఎన్ని చూశారు? మిగిలిన వాటిపైనా ఓ లుక్కేయండి మరి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe