ఇంతకాలం మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది.. మంచు మనోజ్ కామెంట్స్
మంచు మనోజ్ చాలా కాలం గ్యాప్ తర్వాత కనిపించిన సినిమా భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌తో కలిసి మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ మే 30న థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన భైరవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో మంచు మనోజ్‌తోపాటు హీరోలు పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. తమిళ సూపర్ హిట్ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన భైరవంకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ భారీగా నిర్మించారు.

బ్లాక్ బస్టర్ హిట్ అని
మే 30న ప్రపంచవ్యాప్తంగా భైరవం సినిమా విడుదల అయింది. థియేటర్లలో రిలీజ్ అయిన భైరవం అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం భైరవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
సాయి గారు.. భైరవం సినిమా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది?
-ఈ సినిమాలో నా పర్ఫామెన్స్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఇలాంటి కథ దొరికినప్పుడే మన పర్ఫామెన్స్‌కి స్కోప్ ఉంటుంది. అలాంటి కథ భైరవంతో రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది నాకు, నా కెరీర్‌లో మోఎస్ట్ మెమరబుల్ మూవీ.
-ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. చూసిన ప్రతి ఆడియన్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మా భైరవం థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్‌కి వెళ్లి మా సినిమాలు చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా ఇది. మంచి హైతో ఆడియెన్స్ బయటకు వస్తారు.
రోహిత్ గారు.. ఈ సినిమాలో మీరు చాలా సెటిల్డ్‌గా యాక్ట్ చేశారు. ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-ఈ సినిమాకి చాలా మంచి టీమ్ కుదిరింది. విజయ్‌కి చాలా క్లారిటీ ఉంది. తనతో మాట్లాడి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చేయడం జరిగింది. నిజానికి నేను ఇంత మాస్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. డైరెక్టర్ విజయ కారణంగానే అంతా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ని ఇవ్వగలిగాను.
-ఇప్పటివరకు సినిమా చూసిన ఆడియన్స్ అందరు కూడా చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇది థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా. మీరందరూ కూడా థియేటర్స్ వెళ్లి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
మనోజ్ గారు.. ఈ సినిమా కోసం మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?
-ఒక్కటని చెప్పలేను. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలామంది ఇంతకాలం మిమ్మల్ని మిస్ అయ్యాను అని చెప్పడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది. నా ఇంట్రడక్షన్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, అప్లోజ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అది చూసినప్పుడల్లా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇదంతా గాడ్ బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



