అది డీఎన్‌ఏ.. మోహన్ బాబు దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి.. మంచు మనోజ్ కామెంట్స్
మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ రెస్పాన్స్ పర్వాలేదనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో భైరవం మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరోలు, డైరెక్టర్‌ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బీభత్సం 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్స్‌గా చేశారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భైరవం చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

బ్లాక్ బస్టర్ బీభత్సం భైరవం
ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం 'భైరవం' క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మంచు మనోజ్‌తోపాటు ఇతర హీరోలు, డైరెక్టర్ విజయ్ కనకమేడలను అడిగిన ప్రశ్నలు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. అయితే, మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో మంచు మనోజ్ ఇచ్చిన ఓ సమాధానం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మనోజ్ గారు సినిమాలో మీ వాయిస్, డిక్షన్ మోహన్ బాబు గారి సిమిలారిటీస్ కనిపించింది? ఇది కావాలని ట్రై చేశారా ?
-అది డీఎన్ఏ. ఆయన (మోహన్ బాబు) దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. తొమ్మిదేళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చాను. నన్ను ఎంతో గొప్పగా ఆదరించారు. ఈ సందర్భంగా ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
-మా సినిమా స్టార్టింగ్ నుంచి మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి, సోషల్ మీడియాకి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మళ్లీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నాను.
-నేను చేసిన గజపతి క్యారెక్టర్‌కి చాలా డెప్త్ ఉంది. ఈ సినిమా కోసం డబ్బింగ్‌కి కష్టపడినంత ఏ సినిమాకి కష్టపడలేదు. డైరెక్టర్ గారు చాలా పవర్‌ఫుల్‌గా క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాకి పేరు వచ్చిందంటే దానికి కారణం మా డైరెక్టర్ గారు. మా కో స్టార్స్ . ముగ్గురు హీరోలకి సమానంగా పేరు వచ్చింది. ఈ క్రెడిట్ డైరెక్టర్ గారికి దక్కుతుంది.
విజయ్ గారు ముగ్గురు హీరోల్ని డీల్ చేయడం కష్టమనిపించిందా ?
-ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. కథలో మూడు క్యారెక్టర్స్‌ని బ్యాలెన్స్ చేయడం కష్టం. అందరి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేశాం.
-సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ముగ్గురు హీరోలకి ఇది అద్భుతమైన కమ్ బ్యాక్ అని ఆడియన్స్ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



