...
...
Next Story

మంచు మనోజ్ కన్నప్ప రివ్యూ: నేను అనుకున్న దాని కంటే వెయ్యి రెట్లు బాగుంది.. ప్రభాస్ వచ్చిన తర్వాత మరో లెవెల్..

మంచు మనోజ్ కన్నప్ప మూవీ రివ్యూ ఇచ్చాడు. తన అన్న మంచు విష్ణు, తండ్రి మోహన్ బాబుతో గొడవల నేపథ్యంలో అతడు ఈ సినిమా చూసి అద్భుతమని మెచ్చుకోవడం గమనార్హం. ప్రభాస్ ఎంట్రీ తర్వాత మరో లెవెల్ అని అతడు అన్నాడు.

Published on: Jun 27, 2025, 13:59:42 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

కన్నప్ప మూవీకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా మంచు విష్ణు తమ్ముడు, మోహన్ బాబు చిన్న కొడుకు, నటుడు మంచు మనోజ్ కూడా ఈ సినిమా అద్భుతమని కొనియాడాడు. తాను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు బాగుందని అతడు అనడం విశేషం. అన్న పేరు ఎత్తకుండానే అతని నటన కూడా అద్భుతమని పరోక్షంగా చెప్పాడు.

కన్నప్ప చాలా చాలా బాగుంది

మంచు మనోజ్ కన్నప్ప రివ్యూ: నేను అనుకున్న దాని కంటే వెయ్యి రెట్లు బాగుంది.. ప్రభాస్ వచ్చిన తర్వాత మరో లెవెల్..
మంచు మనోజ్ కన్నప్ప రివ్యూ: నేను అనుకున్న దాని కంటే వెయ్యి రెట్లు బాగుంది.. ప్రభాస్ వచ్చిన తర్వాత మరో లెవెల్..

మంచు మనోజ్ శుక్రవారం (జూన్ 27) ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కన్నప్ప మూవీ చూశాడు. ఐదు నిమిషాలు ఆలస్యంగా అతడు థియేటర్లోకి వెళ్లాడు. ఆ ఐదు నిమిషాల కోసం రేపు మరోసారి సినిమా చూస్తానని కూడా అతడు మీడియాతో అనడం విశేషం. ఈ సినిమా చాలా చాలా బాగుందని, లీడ్ రోల్స్ అందరూ అద్భుతంగా చేశారని మనోజ్ స్పష్టం చేశాడు. తన అన్న, తండ్రి పేర్లు అతని నోటి వెంట రాలేదు కానీ.. పరోక్షంగా వాళ్లను కూడా అతడు ప్రశంసించాడు.

“కన్నప్ప చూశాను. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత మరో లెవెల్ కు వెళ్తుంది. ప్రతి ఒక్కరూ లీడ్ క్యారెక్టర్స్ క్లైమ్యాక్స్ తో ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. చాలా అద్భుతంగా చేశారు. నేను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు గొప్పగా ఉంది. టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు. సినిమా గొప్ప విజయం సాధించాలి. మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు రావాలి. నేను ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లాను. ఆ ఐదు నిమిషాల కోసం రేపు మరోసారి సినిమా చూస్తాను” అని మనోజ్ అనడం విశేషం.

ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన కన్నప్ప మూవీలో మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు అతిథి పాత్రలు పోషించారు. ఈ సినిమాను మోహన్ బాబే నిర్మించాడు. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

ముఖ్యంగా ప్రభాస్ పాత్ర చాలా బలంగా ఉందని, అతని ఎంట్రీ తర్వాత చివరి 20 నిమిషాలు మరో లెవెల్ అని అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. ఎన్నో రోజులుగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న కన్నప్ప టీమ్ ఈ రివ్యూలతో సంతోషంగా ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వసూళ్లు కూడా బాగానే ఉంటాయని భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe