జీవితంలో ఒక టైమ్‌లో దేవుడు నిజంగా ఉన్నాడా అనే డౌట్ వస్తుంది.. హీరో మంచు విష్ణు కామెంట్స్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి స్టార్స్ కలిసి నటించిన సినిమా కన్నప్ప. రీసెంట్‌గా గుంటూరులో జరిగిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తెలుగు హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న థియేటర్లలో కన్నప్పవిడుదల కానున్న నేపథ్యంలో రీసెంట్‌గా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కన్నప్ప ఈవెంట్‌లో హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మా నాన్న దేవుడు
మంచు విష్ణు మాట్లాడుతూ .. "కన్నప్ప ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగింది. మాకు మెమరబుల్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా తీయడానికి, నేను ఇక్కడ నిలబడటానికి చాలామంది సాయం చేసారు. నాకు మా నాన్న దేవుడు.. ఆయన లేకపోతే నేను లేను. అందుకే మా నాన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి" అని అన్నాడు.
"ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకూ కూడా బ్రహ్మానందం గారు ఈ సినిమా విషయంలో ధైర్యం చెబుతూనే ఉన్నారు. నాకు ఫోన్ చేసి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది.. ధైర్యంగా ఉండమని ప్రతీ నిమిషం చెబుతూ వచ్చారు" అని మంచు విష్ణు తెలిపాడు.
పనులన్నీ మానుకుని
"ప్రభుదేవా ఒక కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, డైరెక్టర్‌గా సక్సెస్ చూసారు. ఆయన పనులన్నీ మానుకొని కన్నప్ప సినిమాకి మూడు పాటలు చేయాల్సిన అవసరం లేదు. అయినా మా కోసం చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. ముఖేష్ రిషి, శివ బాలాజీ, రఘుబాబు.. ప్రతీ ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్స్" అని విష్ణు మంచు వెల్లడించాడు.
"డైరెక్టర్ ముఖేష్ సింగ్ భాష రాకపోయినా 'కన్నప్ప' సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు. సినిమా ఎప్పుడు చేస్తామో తెలియకుండానే 2017లోనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది" అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
నాకోసం చేయలేదు
"నా మిత్రుడు ప్రభాస్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అతను కన్నప్ప సినిమా చేయడానికి కారణం.. నాన్న మీద ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం. నాన్న కోసం ప్రభాస్ ఈ సినిమా చేసారు కానీ, నాకోసం చేయలేదు. అతనికి ఈ క్యారక్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాలంలోనూ పెద్దల పట్ల గౌరవం, స్నేహానికి విలువ ఉందనడానికి ప్రభాస్ ఒక ఉదాహరణ. మీరందరూ అతని స్టార్‌డమ్‌ని కాదు, అతని వ్యక్తిత్వాన్ని ప్రేమించండి" అని మంచు విష్ణు పేర్కొన్నాడు.
"మోహన్ లాల్ ఒక మహా నటుడు. జీవితంలో ఒక సందర్భంలో మనందరికీ దేవుడు నిజంగానే ఉన్నాడా అనే డౌట్ ఉంటుంది. అక్కడి నుంచే భక్తి పుడుతుంది. దేవుడికి దాసోహం అవుతాం. కన్నప్ప సినిమా కూడా అంతే. ఈ ప్రయాణం ఒక వ్యక్తిగా నన్ను చాలా మార్చింది" అని మంచు విష్ణు అన్నాడు.
50 ఏళ్ల తర్వాత
"దాదాపు 50 ఏళ్ల తర్వాత కన్నప్ప కథను చిత్రీకరించాం. యాభై ఏళ్ల తర్వాత కన్నప్ప కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నా. కన్నప్పను ఎన్నో సంవత్సరాలుగా ఒక బిడ్డగా చూసుకున్నాం. జూన్ 27న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని మంచు విష్ణు తన స్పీచ్ ముగించాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



