నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే నేను మాత్రం అతనికి కర్ణుడిని.. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంచు విష్ణు కామెంట్స్

మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి దిగ్గజాలు నటించిన కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 21న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ఒక్కొక్కరి గురించి మంచు విష్ణు చాలా గొప్పగా చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..!

Published on: Jun 22, 2025, 06:48:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన సినిమా ‘కన్నప్ప’. బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27న కన్నప్ప విడుదల కానుంది. ఈ సందర్భంగా జూన్ 21న హైదరాబాద్‌లో ఘనంగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మంచు విష్ణు ప్రతి ఒక్కరి గురించి గొప్పగా చెప్పాడు.

నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే నేను మాత్రం అతనికి కర్ణుడిని.. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంచు విష్ణు కామెంట్స్
నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే నేను మాత్రం అతనికి కర్ణుడిని.. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంచు విష్ణు కామెంట్స్

మంచు విష్ణు కామెంట్స్

మంచు విష్ణు మాట్లాడుతూ .. "కన్నప్ప విష్ణు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ చిత్రాన్ని చూసినప్పుడు వావ్ అనిపించింది. కన్నప్ప అనేది శివానుగ్రహంతోనే జరిగింది. ఈ ప్రయాణంలో నాకు విజయ్, వినయ్ వెన్నంటే ఉన్నారు" అని అన్నాడు.

"2017లో స్టీఫెన్ దేవస్సీని కలిశాను. ఈ కన్నప్పని ఎప్పుడు చేస్తాను.. ఎలా చేస్తాను అన్నది చెప్పలేను.. కానీ, ఎప్పుడు చేసినా కూడా మీరే మ్యూజిక్ ఇవ్వాలని స్టీఫెన్ గారికి అప్పుడే చెప్పాను. ఈ కథ కోసం పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. శివ బాలాజీచేసిన సాయాన్ని బయటకు చెప్పలేను. మోహన్లాల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది" అని మంచు విష్ణు తెలిపాడు.

కారణం ఆయనే

"మా కోసం వచ్చిన అక్షయ్ కుమార్ గారికి థాంక్స్. శరత్ కుమార్ గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. తమిళంలో ఈ చిత్రం పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతోందంటే దానికి శరత్ కుమార్ గారే కారణం. న్యూజిలాండ్ షూటింగ్‌కి కూడా ఆయనే సపోర్ట్ చేశారు. ఈ చిత్రం ప్రారంభం కాక ముందే బ్రహ్మానందం గారు దీవెనలు అందిస్తూ ఉన్నారు" అని విష్ణు మంచు పేర్కొన్నాడు.

"ఆంటోని ఎడిటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కనిపించని హీరో ఆంటోని. నా కెరీర్‌లో ఉన్న దర్శకులందరిలోనూ ముఖేష్ గారు ది బెస్ట్. కన్నప్ప ప్రయాణం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఎన్నో బాధలు పడ్డాం. అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీస్తున్నావ్ అని శివ రాజ్ కుమార్ అడిగారు. 50 ఏళ్ల తరువాత మళ్లీ మన కన్నప్ప గురించి ఈ తరానికి చెప్పాలని ఆ శివుడే నాతో ఈ మూవీని తీయించారేమో అని శివన్నతో అన్నాను" అని మంచు విష్ణు వెల్లడించాడు.

స్నేహంలో రెండు రకాలుంటాయి

"స్టీఫెన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. శివా శివా శంకరా పాట నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్‌గానే అనిపిస్తుంటుంది. ఆ పాటే నన్ను కాపాడింది. స్నేహంలో కృష్ణుడిగా, కర్ణుడిగా రెండు రకాలుంటాయి. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉంటారు" అని మంచు విష్ణు అన్నాడు.

"అసలు ఈ చిత్రాన్ని చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. నాన్న గారి మీదున్న గౌరవంతోనే ప్రభాస్ ఈ మూవీని చేశారు. స్టార్‌గా కంటే.. ప్రభాస్ మానవత్వం ఇంకెంతో గొప్పగా ఉంటుంది. కొంత డబ్బు, పేరు వచ్చినా అంతా మారిపోతారు. కానీ, ప్రభాస్మాత్రం ఇంకా అలానే ఒదిగి ఉంటారు" అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

3 పాటల్ని చేశారు

"నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే.. నేను మాత్రం ప్రభాస్‌కి కర్ణుడిని. ఆయనకు ఎప్పుడూ, ఎల్లప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాను. నాకు మోహన్ బాబు గారు దేవుడు. ప్రభు దేవా గారు మాకోసం మూడు పాటల్ని చేశారు. మా చిత్రం జూన్ 27న రాబోతోంది. శివుని ఆశీస్సులు, ఆడియెన్స్ ప్రేమతో పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాను" అని మంచు విష్ణు తన స్పీచ్ ముగించాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More