...
...
Next Story

కన్నప్ప తర్వాత మంచు విష్ణు చేసే సినిమా ఈ జానర్‌లోనే! దర్శకుడు ఎవరంటే..

కన్నప్ప తర్వాత తదుపరి చిత్రానికి మంచు విష్ణు రెడీ అవుతున్నారు. ఈ మూవీకి దర్శకుడు ఎవరో సమాచారం బయటికి వచ్చింది. ఏ జానర్లో మూవీ చేయనున్నారో కూడా తెలిసింది. ఆ వివరాలు ఇవే.

Published on: Jun 29, 2025, 22:22:10 IST
By
Prefer HTon Google
Advertisement

మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలో ఈ మైథలాజికల్ మూవీ విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమాకు వసూళ్లు బాగా వస్తున్నాయి. ఈ మూవీలో విష్ణు నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ తరుణంలో తన తదుపరి చిత్రానికి విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ప్రభుదేవా దర్శకత్వంలో..

కన్నప్ప తర్వాత మంచు విష్ణు చేసే సినిమా ఈ జానర్‌లోనే! దర్శకుడు ఎవరంటే!
కన్నప్ప తర్వాత మంచు విష్ణు చేసే సినిమా ఈ జానర్‌లోనే! దర్శకుడు ఎవరంటే!

డెవోషనల్ మూవీ కన్నప్ప తర్వాత మంచు విష్ణు ఏ చిత్రం చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు తదుపరి సినిమా చేయనున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న ప్రభుదేవా ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయనతో నెక్ట్స్ చిత్రం చేసేందుకు విష్ణు గ్రీన్‍సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. విష్ణు - ప్రభుదేవా కాంబోలో ఈ చిత్రం కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో ఉంటుందని సమాచారం.

ప్రభుదేవాతో చేసే చిత్రంలో మంచు విష్ణు పాత్ర ఎనర్జిటిక్‍గా ఉండేలా ప్లాన్ చేశారట. ప్రభుదేవా స్టైల్ డైనమిక్ స్టోరీలైన్‍తో ఈ సినిమా ఉంటుందని టాక్. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు ఫ్యామిలీనే నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కన్నప్ప కలెక్షన్లు

కాగా, థియేటర్లలో కన్నప్పజోరు చూపిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.40కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకున్నట్టు అంచనా. మూడో రోజైన ఆదివారం కూడా వసూళ్లు బాగానే నమోదవుతున్నాయి. బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఇది అర్థమవుతోంది. అయితే, సోమవారం నుంచే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అసలు పరీక్ష మొదలుకానుంది. సోమవారం కూడా జోరు చూపిస్తే బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగే ఛాన్స్ ఉంటుంది. మరి మండే టెస్టును ఈ చిత్రం పాస్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది.

విష్ణుకు ప్రశంసలు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks