...
...
Next Story

మణిరత్నం డైరెక్ట్ చేసిన టాప్ 7 బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. థగ్ లైఫ్ రిలీజ్‌కు ముందే వీటిని ఈ ఓటీటీలో చూసేయండి

మణిరత్నం డైరెక్ట్ చేసిన థగ్ లైఫ్ మూవీ గురువారం (జూన్ 5) రిలీజ్ కాబోతోంది. అయితే అంతకుముందే ఈ లెజెండరీ డైరెక్టర్ తీసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవి? వాటిని ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోండి. ఒకప్పటి నాయకుడు నుంచి దిల్ సేలాంటి మూవీస్ వరకు చూడండి.

Published on: Jun 4, 2025, 16:53:49 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మణిరత్నం.. ఇండియా మెచ్చే దర్శకుల్లో ఒకరు. అలాంటి డైరెక్టర్ నుంచి ఇప్పుడు థగ్ లైఫ్ మూవీ రాబోతోంది. 1987 తర్వాత కమల్ హాసన్ తో మణిరత్నం తీసిన సినిమా ఇది. గురువారం (జూన్ 5) సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ లెజెండరీ డైరెక్టర్ తీసిన గొప్ప సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.

1. నాయకుడు - యూట్యూబ్

మణిరత్నం డైరెక్ట్ చేసిన టాప్ 7 బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. థగ్ లైఫ్ రిలీజ్‌కు ముందే వీటిని ఈ ఓటీటీలో చూసేయండి
మణిరత్నం డైరెక్ట్ చేసిన టాప్ 7 బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. థగ్ లైఫ్ రిలీజ్‌కు ముందే వీటిని ఈ ఓటీటీలో చూసేయండి

మణిరత్నం తీసిన సినిమాల్లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్, కల్ట్ క్లాసిక్ హోదా సొంతం చేసుకున్న సినిమా నాయకుడు. అంతేకాదు అతని సినిమాల్లో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ 8.6 సొంతం చేసుకుంది. ఈ మూవీని యూట్యూబ్ లో చూడొచ్చు. ఇందులో కమల్ హాసన్ నటన మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు బాంబేని వణికించిన వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది.

2. దళపతి - ప్రైమ్ వీడియో

మణిరత్నం తీసిన దళపతి మూవీకి 8.5 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఇది ఇద్దరు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరిగే సినిమా. రజనీకాంత్, మమ్ముట్టిలాంటి సూపర్ స్టార్లు ఇందులో నటించారు. సూర్య, దేవరాజ్ పాత్రల్లో వీళ్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రైమ్ వీడియోలో మూవీని చూడొచ్చు.

3. మౌనరాగం - ప్రైమ్ వీడియో, యూట్యూబ్

మౌనరాగం మూవీ 1986లో వచ్చింది. ఐఎండీబీలో 8.4 రేటింగ్ ఉంది. రేవతి, మోహన్, కార్తీక్ లాంటి వాళ్లు నటించారు. తన ప్రేమికుడిని కోల్పోయిన ఓ యువతి మరొకరిని పెళ్లి చేసుకొని అతనితో జీవితంలో అడ్జెస్ట్ కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలో అందుబాటులో ఉంది.

4. గీతాంజలి - ప్రైమ్ వీడియో

అంజలి మరో సూపర్ క్లాసిక్ మూవీ. ఓ దివ్యాంగురాలైన చిన్నారి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. షామిలి ఇందులో అద్భుతంగా నటించింది. చిన్నారులతోనే మణిరత్నం అద్భుతాలు చేయగలడని నిరూపించిన సినిమా ఇది. ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉన్న ఈ మూవీని యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.

6. రోజా - ప్రైమ్ వీడియో, యూట్యూబ్

మణిరత్నం డైరెక్షన్ లో 1992లో వచ్చిన మూవీ రోజా. కశ్మీర్ ఉగ్రవాదానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ లెజెండరీ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ మూవీని ప్రైమ్ వీడియోతోపాటు యూట్యూబ్ లో చూడొచ్చు. ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉన్న సినిమా ఇది.

7. బాంబే - ప్రైమ్ వీడియో, యూట్యూబ్

బాంబే కూడా మణిరత్నం కెరీర్లోని బెస్ట్ సినిమాల్లో ఒకటి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అప్పటి బాంబే నగరంలో జరిగిన అల్లర్ల ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది. ఈ సినిమా కూడా ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలో అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ సొంతం చేసుకుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe