115 మంది నిర్మాతలు నిర్మించిన తెలుగు రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్.. 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్.. 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్!

రెండు ఓటీటీల్లో తెలుగు రొమాంటిక్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మను డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా 115 మంది నిర్మాతలు నిర్మించిన తొలి సినిమాగా పేరు తెచ్చుకుంది మను. అలాగే తెలుగు ఫస్ట్ క్రౌడ్ ఫండింగ్ మూవీగా నిలిచిన మను ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 5, 2025, 05:30:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల్లో ఎన్నో రకాల చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు సైతం ఓటీటీలో అలరిస్తుంటాయి. ఇలాంటి ఎక్స్‌పరిమెంటల్ మూవీస్ ఎక్కువగా మలయాళం, హాలీవుడ్‌లో మాత్రమే వస్తాయని అపోహ ఉంది. కానీ, తెలుగులో కూడా ప్రయోగాత్మక చిత్రాలు ఎప్పుడో వచ్చాయి.

115 మంది నిర్మాతలు నిర్మించిన తెలుగు రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్.. 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్.. 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్!
115 మంది నిర్మాతలు నిర్మించిన తెలుగు రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్.. 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్.. 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్!

కలర్ ఫొటో హీరోయిన్

అందుకు ఉదాహరణే మను మూవీ. 2018లో వచ్చిన మను మూవీ తెలుగు లాంగ్వేజ్ ఎక్స్‌పరిమెంటల్ రొమాంటిక్ ఆర్ట్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. ఈ సినిమాతో ఫణీంద్ర నర్సెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. అంతేకాకుండా మను మూవీలో బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.

ఐఎమ్‌డీబీ రేటింగ్

వీరితోపాటు అభిరామ్ వర్మ, కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ మోహన్ భగత్, జాన్ కొట్టోలి, అప్పాజీ అంబరీష దర్బ, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్, మిస్టరీ, సస్పెన్స్, మెలో డ్రామా థ్రిల్లర్‌ వంటి అంశాలతో మను తెరకెక్కించారు. సెప్టెంబర్ 7, 2018లో థియేటర్లలో విడుదలైన మను సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.6 రేటింగ్ వచ్చింది.

115 మంది నిర్మాతలతో

అంటే, అంతలా మను ఆకట్టుకుంది. దీనికంటే మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మను మూవీకి 115 మంది నిర్మాతలు ఉండటం. సాధారణంగా ఒకరిద్దరు, లేదా పది వరకు నిర్మాతలు ఉంటారు. కానీ, ఏకంగా 115 మంది నిర్మాతలతో తెరకెక్కిన సినిమాగా మను నిలిచింది. అయితే, మను సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించారు.

క్రౌడ్ ఫిండింగ్‌తో నిర్మాణం

అంటే, మంచి సినిమా తీయాలని తపన ఉండే ఔత్సాహికులు కొన్ని చిత్రాలకు ఫండ్స్ ఇస్తారు. అలా క్రౌడ్ ఫండింగ్‌తో మను మూవీకి 115 మంది నిర్మాతలు అయ్యారు. దీంతో క్రౌడ్ ఫండింగ్‌తో తీసిన తొలి సినిమాగా కూడా మను రికార్డ్ కొట్టింది. ఇక సినిమాలో వచ్చే కెమెరా షాట్స్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

ఇంతటి విశేషాలు ఉన్న మను ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో మను డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లలో మను ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇండియా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మను అందుబాటులో లేదు. విదేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల మను సినిమాను చూడొచ్చు.

క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

ఇకపోతే మను సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ యూనిక్ స్టోరీ టెల్లింగ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రతి ఒక్క సీన్ పెయింటింగ్‌లా ఉంటుందని, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందని సినిమా క్రిటిక్స్ చెప్పారు.

నిడివి ఎక్కువ

డైరెక్షన్, ప్రొడక్షన్, మ్యూజిక్, కలర్ కరెక్షన్, కాస్ట్యూమ్స్‌తో మను ఆకట్టుకుందని టాక్. అయితే, మను మూడు గంటల రన్‌టైమ్ కాస్తా ఓపికకు పరీక్ష పెడుతుందని మను సినిమాపై రివ్యూలు వచ్చాయి. ఈ తెలుగు రొమాంటిక్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మనును అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More