Malayalam Thriller: జర్నలిస్ట్ మిస్సింగ్.. మైండ్ బ్లాంక్ చేసే ట్విస్టులు.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ
Malayalam Thriller: ఓటీటీలోకి ఈరోజు మరో మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓ జర్నలిస్ట్ మిస్సింగ్, ఊహకందని ట్విస్టుల చుట్టూ తిరిగే ఈ మూవీని సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
Malayalam Thriller: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు ఓటీటీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే కోవలో ఈరోజు అంటే శుక్రవారం (అక్టోబర్ 16) ఓటీటీలోకి వచ్చిన మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణతింటే తుడక్కమ్' (Oru Anweshanathinte Thudakkam) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

దర్శకుడు ఎంఏ నిషాద్ తన తండ్రి, దివంగత DIG పి.ఎం. కుంజుమొయినుద్దీన్ కుట్టి కేస్ డైరీల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను తెరకెక్కించారు. రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కొట్టాయం క్రైమ్ బ్రాంచ్ అధికారుల చేతికి చిక్కిన ఒక మిస్సింగ్ కేస్, దాని వెనుక ఉన్న ఊహించని నిజాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఒరు అన్వేషణతింటే తుడక్కమ్ విశేషాలు
మూవీ టైటిల్ : Oru Anweshanathinte Thudakkam (ఒరు అన్వేషణతింటే తుడక్కమ్)
ఓటీటీ : Sun NXT (సన్ నెక్స్ట్)
డైరెక్టర్ : ఎంఏ నిషాద్
కథ మూలాధారం : డీఐజీ పీఎం కుంజుమొయిద్దీన్ కుట్టి కేస్ డైరీలు
నటీనటులు : షైన్ టామ్ చాకో, ఎంఏ నిషాద్, వాణీ విశ్వనాథ్
జానర్ : ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఒరు అన్వేషణతింటే తుడక్కమ్ స్టోరీ ఏంటంటే?
ఈ సినిమా కథ జీవన్ థామస్ (షైన్ టామ్ చాకో) అనే ఒక డేరింగ్ అండ్ సోషల్ మీడియా జర్నలిస్ట్ అదృశ్యం చుట్టూ తిరుగుతుంది. సమాజంలో సంచలనం సృష్టించే విషయాలపై నిలదీసే జీవన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కొట్టాయం క్రైమ్ బ్రాంచ్‌కు ఆ కేసు బదిలీ అవుతుంది. అంత చురుగ్గా లేని డీవైఎస్పీ ఐజాక్ మామెన్ (ఎంఏ నిషాద్) ఈ కేసును టేకప్ చేస్తారు.
పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లే కొద్దీ, కేవలం ఒక మిస్సింగ్ కేసు కాకుండా దాని వెనుక పెద్ద కుటుంబ రాజకీయాలు, ద్రోహాలు, ఊహించని రహస్యాలు బయటపడతాయి. ఒక కేసు దర్యాప్తు మరో పెద్ద క్రైమ్‌కు దారితీసే తీరు ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది.
మూవీ ఎలా ఉందంటే?
జీవన్ థామస్ పాత్రలో షైన్ టామ్ చాకో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శకుడు ఎంఏ నిషాద్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత తెరపైకి రీఎంట్రీ ఇచ్చిన నటి వాణి విశ్వనాథ్ తన పాత ఎనర్జీని ప్రదర్శించి హైలైట్‌గా నిలిచారు. స్టార్ నటీనటులు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సన్నివేశాల్లో పాత్రలు ఎక్కువగా అనిపించినప్పటికీ, ఆర్టిస్టులందరూ తమ పరిధి మేరకు చక్కగా నటించారు.
వివేక్ మేనన్ సినిమాటోగ్రఫీ, జాన్ కుట్టి ఎడిటింగ్ ఎలాంటి అనవసరమైన హంగులకు పోకుండా చాలా సహజంగా సాగాయి. అయితే 180 నిమిషాల పైచిలుకు రన్‌టైమ్ ఉండటం, సెకండ్ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్లు ఉండటం సినిమా వేగాన్ని కాస్త నెమ్మదిస్తాయి. అయినప్పటికీ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్లో సన్ నెక్స్ట్లో చూడదగ్గ మంచి ఇన్వెస్టిగేషన్ డ్రామా ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


