వెన్నుపోటు ఆయుధమవుతుంది నాయుడు..ఇద్దరు సీఎంలు.. క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి ఎప్పుడంటే? సీబీఎన్, వైఎస్సార్ కథతోనేనా?

తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన రాజకీయ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరూ గతంలో సీఎంలుగా పని చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఫ్రెండ్స్ గా మారిన ప్రత్యర్థులు వీళ్లు అంటూ వీళ్ల కథతోనే ఓ క్రేజీ వెబ్ సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. 

Published on: Jul 12, 2025, 16:58:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ను మరింత పెంచే.. ఇద్దరు అగ్ర రాజకీయ నాయకుల కథతో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథను రిఫరెన్స్ గా తీసుకుని ఈ సీరిస్ ను రూపొందించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ టీజర్ ను ఈ రోజు (జూలై 12) రిలీజ్ చేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్.. సిరీస్ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసింది.

ఓటీటీలోకి వెబ్ సిరీస్
ఓటీటీలోకి వెబ్ సిరీస్

ఆ ఓటీటీలోకి

వైఎస్సార్, సీబీఎన్ కథతో తెరకెక్కుతున్న మూవీకి ‘మయసభ’ అనే టైటిల్ ఖరారు చేశారు. సోనీ లివ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. సోనీ లివ్ ఓరిజినల్ సిరీస్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా శనివారం అనౌన్స్ చేశారు. ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ పొలిటీషియన్స్ కథతో రాబోతోంది ఈ సిరీస్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

‘‘పొలిటికల్ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు గొప్ప స్నేహితుల కథ. స్టోరీ ఆఫ్ ది స్టేట్ గా మారిన కథ’’ అని సోనీ లివ్ పేర్కొంది.

టీజర్ ఇలా

దివంగత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, వైశ్రాయ్ హోటల్ సీన్లను గుర్తు చేస్తూ మయసభ టీజర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఇద్దరు మెయిన్ లీడర్లు ఫోన్లో మాట్లాడుకుంటారు. ‘ఏం జరుగుతుంది నాయుడు’ అని అడిగితే ‘కురుక్షేత్రం’ అని సమాధానం వస్తుంది. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినవ్, ఫ్రెండ్ గానా? ప్రత్యర్థి గానా’ అని అడుగుతాడు. అర్థం కావడం లేదు రెడ్డి అంటాడు. ఈ రోజు నువ్వు గెలిస్తే వెన్నుపోటు అనేది నా చేతిలో ఆయుధంగా మారుతుంది అని రెడ్డి అంటాడు.

చివరకు పిల్లనిచ్చి మామతోనే ఉనికి కోసం పోరాడుతున్నా అని నాయుడు అంటే.. యుద్ధం నీ ధర్మం అని రెడ్డి అంటాడు. ఇక రెడ్డి, నాయుడు కాలేజీ రోజులు, గొడవలు, గ్రూప్ తగాదాలతో టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

నాగ చైతన్య అనుకుంటే

దేవా కట్టా, కిరణ్ జై కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మయసభ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నటిస్తారనే వార్తలొచ్చాయి. కానీ అతను ఈ సిరీస్ లో లేడు. ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ ప్లే చేశారు. వైఎస్సార్ గా ఆది పినిశెట్టి, సీబీఎన్ గా చైతన్య రావు యాక్ట్ చేశారు. ఈ సిరీస్ లో సాయి కుమార్, దివ్య దత్తా, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More