గుండె నిండా గుడి గంటలు: మీనాకు కన్ను కొట్టిన సత్యం.. ఆటాడుకున్న కోడలు.. ముసలోడే గానీ అంటూ!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ స్టార్ మా ఛానెల్, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం అవుతుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్‌కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, గుండె నిండా గుడి గంటలు సీరియల్ షూటింగ్‌లో సత్యం కన్ను కొట్టాడంటూ అమూల్య గౌడ అల్లరి చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

Jun 15, 2025, 09:08:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సత్యంను గిల్లిన మీనా

తర్వాత బాలుతో సత్యం మాట్లాడుతున్న సన్నివేశం షూట్ చేస్తుంటే పక్కనే ఉన్న మీనా సత్యంను గిల్లింది. అది తెలిసి ఇలా చేయకు అని సత్యం అంటే.. శ్రీకాంత్‌నే బెదిరించింది అమూల్య గౌడ. ఇలా సత్యంను కోడలు మీనా, సీరియల్ టీమ్ ఆడుకుంటే శ్రీకాంత్ హెబ్లికర్ మాత్రం ప్రాధేయపడాల్సి వచ్చింది. ఇలా సాగిన ఈ గుండె నిండా గుడి గంటలు షూటింగ్ వీడియో వైరల్ అవుతోంది.

గుండె నిండా గుడి గంటలు: మీనాకు కన్ను కొట్టిన సత్యం.. ఆటాడుకున్న కోడలు.. ముసలోడే గానీ అంటూ!
గుండె నిండా గుడి గంటలు: మీనాకు కన్ను కొట్టిన సత్యం.. ఆటాడుకున్న కోడలు.. ముసలోడే గానీ అంటూ!

తెలుగు బుల్లితెర టాప్ ఛానెల్స్‌లలో స్టార్ మా ఒకటి. స్టార్ మా ఛానెల్స్‌లో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. వాటిలో ఒకటే గుండె నిండా గుడి గంటలు సీరియల్. స్టార్ మా, జియో హాట్‌స్టార్ ఓటీటీలలో గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ స్ట్రీమింగ్ అవుతుంటుంది.

మీనా పాత్రకు క్రేజ్

అచ్చమైన తెలుగు కుటుంబ కథా నేపథ్యంతో సాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఆదరణను సాధించింది. సీరియల్‌లోని పాత్రలు నిజ జీవితంలో చాలా వరకు ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా చేసిన మీనా పాత్ర మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాత్ర పోషించిన కన్నడ భామ అమూల్య గౌడ మరింత పాపులర్ అయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు, మీనా పాత్రలు చాలా మందికి ఫేవరెట్. వీటితోపాటు మంచి వ్యక్తిత్వం, హుందాతనంతో సత్యం పాత్ర ఉంటుంది. ఈ రోల్ కూడా ప్రేక్షకుల్లో అభిమానాన్ని పొందింది. సత్యం పాత్రలో నటుడు శ్రీకాంత్ హెబ్లికర్ (Srikanth Hebligar) చక్కగా ఒదిగిపోయారు. మామగా, తండ్రిగా, భర్తగా తన పాత్రకు తగినట్లుగా అలరిస్తున్నారు.

రీల్ వర్సెస్ రియల్

ఇక మీనా, సత్యం మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఆప్యాయంగా బాగుంటాయి. కోడలిని కూతురులా చూసుకునే తీరు బాగుంటుంది. మామపై ఎంతో గౌరవంగా అణుకువుగా నడుచుకుంటుంది మీనా. అయితే, ఇదంతా రీల్ లైఫ్‌లో సీరియల్‌లో. కానీ, నిజ జీవితంలో మాత్రం మంచి సత్యంను ఆటపట్టిస్తుంటుంది మీనా.

రీల్ లైఫ్‌లో ఆన్ స్క్రీన్‌లో మామ-కోడళ్లుగా ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో నటించే అమూల్య గౌడ, శ్రీకాంత్ హెబ్లికర్ ఆన్ స్క్రీన్‌లో మాత్రం మంచి ఫ్రెండ్స్‌లా జోకులు, కౌంటర్స్ వేసుకుంటూ సందడి చేస్తుంటారు. అందుకు ఉదాహరణే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న ఈ వీడియో. ఇది గుండె నిండా గుడి గంటలు సీరియల్ మేకింగ్ వీడియో.

కన్ను కొడుతున్నాడు సర్

గుండె నిండా గుడి గంటలు షూటింగ్‌లో సత్యంను ఏడిపించింది మీనా. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే.. "సర్ నవ్వుతున్నాడు సర్ (సత్యం). సర్ కన్ను కొడుతున్నాడు" అని మీనా చెప్పింది. "సర్ మీరే చూడండి" అని సత్యం అన్నాడు. "ఏంటీ కన్ను కొడుతున్నాడా.. ముసలోడే గానీ" అని సీరియల్ టెక్నికల్ టీమ్ నుంచి ఎవరో అన్నారు.

"లేదు సర్" అని ప్రామిస్ చేసినట్లుగా చెప్పిన సత్యం (శ్రీకాంత్ హెబ్లికర్) ఏయ్ మీనా (అమూల్య గౌడ).. ఇలా చేయకు అన్నట్లుగా చెప్పాడు. దాంతో అమూల్య గౌడ కళ్లకు కొంగు కప్పుకుంటూ నవ్వింది. "అంటే, ఆయన చేసేది మాకు తెలియకూడదా" అని మరొకరు అంటే.. "అవును సర్" అని అమూల్య గౌడ అంది. దాంతో అంతా నవ్వారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More