పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్‌పై చిరంజీవి, రామ్ చరణ్ రియాక్షన్ చూశారా.. మంట పుట్టించాడంటూ..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. తమ ఎక్స్ అకౌంట్ల ద్వారా వీళ్లు ట్రైలర్ ఎలా ఉందో చెప్పారు. రెండేళ్ల తర్వాత స్క్రీన్‌పై మంట పుట్టిస్తున్నాడంటూ పవన్ గురించి చిరు అనడం విశేషం.
పవన్ కల్యాణ్ మొత్తానికి రెండేళ్ల తర్వాత హరి హర వీరమల్లుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జులై 24న మూవీ రిలీజ్ కానుండగా.. గురువారం (జులై 3) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఈ ట్రైలర్ పై వాళ్లు ప్రశంసల వర్షం కురిపించారు.

చిరంజీవి రియాక్షన్ ఇలా..
పవన్ కల్యాణ్హరి హర వీరమల్లు ట్రైలర్ ఉదయం రిలీజైన విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం తర్వాత చిరంజీవి దీనిపై తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు. తన తమ్ముడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రెండేళ్ల తర్వాత స్క్రీన్ పై మంట పుట్టిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు.
“ఇదో ఎలక్ట్రిఫయింగ్ ట్రైలర్. సుమారు రెండేళ్ల తర్వాత కల్యాణ్ బాబు మూవీ స్క్రీన్స్ పై మంట పుట్టించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్” అని చిరు ట్వీట్ చేశాడు. ఇందులోనే ఈ ట్రైలర్ కు చెందిన యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాడు.
పవన్ ఓ ట్రీట్: రామ్ చరణ్
ఇక కాసేపటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ హరి హర వీరమల్లు ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని షేర్ చేశాడు. తెరపై పవన్ ను చూడటం ఓ ట్రీట్ అని అతడు అనడం విశేషం. “హరి హర వీరమల్లు ట్రైలర్ నిజంగా సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతోంది. బిగ్ స్క్రీన్ పై పవన్ కల్యాణ్ గారిని చూడటం మనందరికీ ఓ ట్రీట్. మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్” అని చరణ్ ట్వీట్ చేశాడు.
హరి హర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉందంటే?
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న హరి హర వీరమల్లుమూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. కొన్నాళ్లుగా గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ట్రైలర్ తో అభిమానులకు మరింత విందు చేశారు. ధర్మం కోసం పోరాడే యోధుడిగా ఇందులో పవన్ కల్యాణ్ కనిపించబోతున్నాడు. ట్రైలర్లో అతడు చాలా పవర్‌ఫుల్ లుక్, డైలాగులతో అదరగొట్టాడు.
సినిమా ఎంత గొప్పగా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొదట క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు. కీరవాణి మ్యూజిక్ అందించాడు. రెండేళ్లుగా పవన్ మూవీ కోసం చేస్తున్న ఫ్యాన్స్ కు ఈ జులై 24న ఓ పండగ రోజు కాబోతోంది. మరి ఈ మూవీ వాళ్ల అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



