రియల్ పోలీస్ ఆఫీసర్ ఆలోచన ఇది- నాలుగేళ్లు నా బుర్రలో మోసాను- అలా అయితే పవన్ కల్యాణ్ దగ్గరికి వెళ్లేవాళ్లం కాదు: హీరో
మొగలి రేకులు సీరియల్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో ఆర్కే సాగర్ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ది 100. ఇవాళ (జులై 11) థియేటర్లలో ది 100 సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పాల్గొన్న విలేకరుల సమావేశంలో హీరో ఆర్కే సాగర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
మొగలి రేకులు సీరియల్‌లో హీరోగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు ఆర్కే సాగర్. ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి చాలా గ్యాప్ తర్వాత పోలీస్‌గా ఆర్కే సాగర్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ది 100. ఇవాళ (జులై 11) థియేటర్లలో ది 100 మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పాల్గొన్న విలేకరుల సమావేశంలో హీరో ఆర్కే సాగర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
రియల్ పోలీస్ ఆఫీసర్ ఆలోచన ఇది- నాలుగేళ్లు నా బుర్రలో మోసాను- అలా అయితే పవన్ కల్యాణ్ దగ్గరికి వెళ్లేవాళ్లం కాదు: హీరో
ఈ కథ ఎలా పుట్టింది?
-ఇది ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచన. సినిమాగా తీసుకోవచ్చా అని అడిగాను. పేరు పెట్టకుండా తీసుకోవచ్చు అని చెప్పారు. దాదాపు ఆలోచనని నాలుగు సంవత్సరాలు పాటు నా బుర్రలో మోసాను.
-ఒకసారి సుకుమార్ గారి దగ్గరికి లంచ్‌కి వెళ్లాను. కథల గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఈ కథ చెప్పాను. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ముందు ఇలాంటి కథ చేయాలని చెప్పారు. వాళ్ల టీంతో కొన్ని రోజులు జర్నీ జరిగింది. తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్స్‌లో బిజీ అయ్యారు.
-ఈ కథ చేసుకుంటానని నేను ఆయనకి చెప్పాను. తర్వాత కథని పూర్తిస్థాయిలో సిద్ధం చేశాం. 100% కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లాం.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మూవీ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు కదా.. మీకు ఎలా అనిపించింది?
-మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన ఈవెంట్‌కి ఒక గెస్ట్‌గా వచ్చి మా పుటేజ్ చూసి చాలా అద్భుతంగా ఫీలయ్యారు. మమ్మల్ని గొప్పగా బ్లెస్ చేశారు. ఆయనకి కంటెంట్ చెప్పాను. ఆయన కచ్చితంగా ఫస్ట్ డేనే ఈ సినిమా చూస్తానని చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఇంకా గొప్పగా చెప్తారని భావిస్తున్నాను.
-కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే చాలా అద్భుతమైన సందేశం ఉన్న సినిమా ఇది. అందుకే ఈ సినిమా గురించి ప్రముఖులకి చెప్పడం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు లాంటి వారు సినిమా చూసి అద్భుతంగా ఉందని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.
-అలాంటి కంటెంట్‌తో వస్తున్నాం కాబట్టి ప్రముఖులు మాట్లాడితే ఈ సినిమా ఇంకా జనాల్లోకి రీచ్ అవుతుందని భావించాము. పవన్ కల్యాణ్ గారికి కంటెంట్ చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన ది 100 ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
-ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి దగ్గరికి వెళ్లాం. నిజానికి ఒక రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా తీసి ఉంటే ఆయన దగ్గరికి వెళ్లే వాళ్లం కాదు. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలి.
-అలా రీచ్ అవ్వాలంటే పవన్ కల్యాణ్ గారు లాంటి వ్యక్తులు మాట్లాడితే ఇంకా అద్భుతంగా రీచ్ అవుతుంది. కల్యాణ్ గారికి కంటెంట్ చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన ది 100 ట్రైలర్ రిలీజ్ చేశారు.