...
...
Next Story

పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్ మిస్సయింది.. కానీ, ఆ ఫీలింగ్ లేదు.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్

మొగలిరేకులు సీరియల్‌లో హీరోగా మెప్పించిన ఆర్కే సాగర్ తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న మూవీ ది 100. జూలై 11న థియేటర్లలో ది 100 మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఓజీ సినిమా మిస్ అయినట్లుగా హీరో ఆర్కే సాగర్ చెప్పుకొచ్చాడు.

Published on: Jul 10, 2025, 10:54:03 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మొగలి రేకులు సీరియల్‌తో తెగ ఫేమ్ తెచ్చుకున్న ఆర్కే సాగర్ తర్వాత సినిమాల్లో హీరోగా మెప్పించాడు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ది 100. జులై 11న ది 100 థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో ఆర్కే సాగర్.

ఈ సినిమాకి 'ది 100' టైటిల్ పెట్టడానికి కారణం?

పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్ మిస్సయింది.. కానీ, ఆ ఫీలింగ్ లేదు.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్
పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్ మిస్సయింది.. కానీ, ఆ ఫీలింగ్ లేదు.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్

-మేము ఒక సినిమా లాగే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాం. 'ది 100' అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది. సొసైటీకి ఏదైనా మంచి చేయాలి అనే తపనతో పెట్టిన టైటిల్ ఇది. లక్కీగా కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి 100 అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీకు తెలుస్తుంది.

-ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. వెరీ టచింగ్ పాయింట్. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. మస్ట్‌గా చూడాల్సిన సినిమా.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

-ఇప్పటివరకు చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ, ఇందులో క్యారెక్టర్ మాత్రం ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే ఈ విషయం చెప్తారు.

ఈ మధ్యకాలంలో మీరు మిస్సయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా?

-పవన్ కల్యాణ్ గారి ఓజీసినిమాలో ఒక ఆఫర్ వచ్చింది. కానీ, ఏదో మిస్ కమ్యూనికేషన్ వల్ల అది కుదరలేదు. అయితే ఆయనతో ఉంటున్నాం కాబట్టి మిస్ అయిన ఫీలింగ్ కలగడం లేదు.

మిషా, ధన్య క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?

-హర్షవర్ధన్ రామేశ్వర్ గారి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. తను కథ విన్నప్పుడే చాలా ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఆయన మ్యూజిక్‌కి చాలా మంచి మార్క్స్ పడతాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks