పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్ మిస్సయింది.. కానీ, ఆ ఫీలింగ్ లేదు.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్
మొగలిరేకులు సీరియల్‌లో హీరోగా మెప్పించిన ఆర్కే సాగర్ తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న మూవీ ది 100. జూలై 11న థియేటర్లలో ది 100 మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఓజీ సినిమా మిస్ అయినట్లుగా హీరో ఆర్కే సాగర్ చెప్పుకొచ్చాడు.
మొగలి రేకులు సీరియల్‌తో తెగ ఫేమ్ తెచ్చుకున్న ఆర్కే సాగర్ తర్వాత సినిమాల్లో హీరోగా మెప్పించాడు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ది 100. జులై 11న ది 100 థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో ఆర్కే సాగర్.
పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్ మిస్సయింది.. కానీ, ఆ ఫీలింగ్ లేదు.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్
ఈ సినిమాకి 'ది 100' టైటిల్ పెట్టడానికి కారణం?
-మేము ఒక సినిమా లాగే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాం. 'ది 100' అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది. సొసైటీకి ఏదైనా మంచి చేయాలి అనే తపనతో పెట్టిన టైటిల్ ఇది. లక్కీగా కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి 100 అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీకు తెలుస్తుంది.
-ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. వెరీ టచింగ్ పాయింట్. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. మస్ట్‌గా చూడాల్సిన సినిమా.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఇప్పటివరకు చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ, ఇందులో క్యారెక్టర్ మాత్రం ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే ఈ విషయం చెప్తారు.
ఈ మధ్యకాలంలో మీరు మిస్సయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా?
-పవన్ కల్యాణ్ గారి ఓజీసినిమాలో ఒక ఆఫర్ వచ్చింది. కానీ, ఏదో మిస్ కమ్యూనికేషన్ వల్ల అది కుదరలేదు. అయితే ఆయనతో ఉంటున్నాం కాబట్టి మిస్ అయిన ఫీలింగ్ కలగడం లేదు.
మిషా, ధన్య క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?
-మిషా క్యారెక్టర్‌లో చాలా డెప్త్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చూస్తే కళ్లలో నీళ్లు ఆగవు. మిషా, ధన్య, విష్ణు ప్రియ.. ఈ మూడు క్యారెక్టర్స్ సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి.
హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ గురించి?
-హర్షవర్ధన్ రామేశ్వర్ గారి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. తను కథ విన్నప్పుడే చాలా ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఆయన మ్యూజిక్‌కి చాలా మంచి మార్క్స్ పడతాయి.
News/Entertainment/పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్ మిస్సయింది.. కానీ, ఆ ఫీలింగ్ లేదు.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్
News/Entertainment/పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్ మిస్సయింది.. కానీ, ఆ ఫీలింగ్ లేదు.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్