ప్రతి యుగంలో ఒక ఆయుధం పుడుతుంది.. ఈ కలియుగంలో ఆ వెపన్ 'ది 100'.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్

మొగలి రేకులు సీరియల్‌తో ఎంతో పాపులర్ అయిన హీరో సాగర్ నటించిన కమ్ బ్యాక్ ఫిల్మ్ ది 100. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. జులై 11న ఈ సినిమా విడుదల కానున్నండగా ది 100 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆర్కే సాగర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

Jul 7, 2025, 10:56:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మొగలి రేకులు సీరియల్‌తో హీరోగా ఎంతో పాపులర్ అయిన ఆర్కే నాయుడు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్కే సాగర్ హీరోగా కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా ది 100. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్గా ది 100 తెరకెక్కింది.

ప్రతి యుగంలో ఒక ఆయుధం పుడుతుంది.. ఈ కలియుగంలో ఆ వెపన్ 'ది 100'.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్
ప్రతి యుగంలో ఒక ఆయుధం పుడుతుంది.. ఈ కలియుగంలో ఆ వెపన్ 'ది 100'.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ కామెంట్స్

ది 100 ప్రీ రిలీజ్ ఈవెంట్

జులై 11న థియేటర్లలో ది 100 సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ది 100 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేశాడు.

హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్‌లా అనిపిస్తుంది. అంజనమ్మ (చిరంజీవి తల్లి) గారు నా సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. వారికి ధన్యవాదాలు. మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు గారు సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి ధన్యవాదాలు" అని తెలిపాడు.

పవన్ కల్యాణ్‌తో ట్రైలర్ లాంచ్

"సజ్జనార్ గారు, నాగబాబు గారు అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. పవన్ కల్యాణ్ గారు ట్రైలర్‌ని లాంచ్ చేస్తే అందరికీ రీచ్ అవుతుందని ఆయన్ని వెళ్లి అడిగాను. ఆయన మా ది 100 ట్రైలర్‌ని లాంచ్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి ధన్యవాదాలు" అని ఆర్కే సాగర్ చెప్పాడు.

"ఐటి మినిస్టర్ శ్రీధర్ అన్నతో నాకు చాలా మంచి బాండ్ ఉంది. ఆయన సినిమా చూసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి కోమటిరెడ్డి గారికి థాంక్యూ. మాకు బ్లెస్ చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉంది" అని ఆర్కే సాగర్ అన్నాడు.

బ్రిలియెంట్ మ్యూజిక్

"మా నిర్మాతలతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. వారి సపోర్ట్‌ని మర్చిపోలేను. డైరెక్టర్ శశి గారు చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో అయినా మంచి పొజిషన్‌లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని ఆర్కే సాగర్ తెలిపాడు.

"ఈ సినిమా ఒక వెపన్. ఈ కథ విన్నప్పుటి నుంచి ఆడియన్స్‌కి ఎప్పుడెప్పుడు చూపించాలి అనే ఎగ్జైట్‌మెంట్ ఉండేది. తప్పకుండా ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి అంత పవర్ ఉంది" అని ఆర్కే సాగర్ చెప్పుకొచ్చాడు.

ప్రతి ఫ్యామిలీ చూడాలి

"ఈ సినిమా మస్ట్‌గా చూడాలి. కమర్షియల్ మూవీ. వెరీ టచింగ్ పాయింట్. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థాంక్యూ" అని ఆర్కే సాగర్ తన స్పీచ్ ముగించాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More