...
...
Next Story

మా అమ్మకు పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు.. నా బావ ప్రభాస్‌కు కృతజ్ఞతలు.. మోహన్ బాబు కామెంట్స్

మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న కన్నప్ప విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఘనంగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ను తాను బావ అని పిలుస్తానని చెప్పుకొచ్చారు.

Published on: Jun 9, 2025, 11:18:03 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు.

కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్

మా అమ్మకు పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు.. నా బావ ప్రభాస్‌కు కృతజ్ఞతలు.. మోహన్ బాబు కామెంట్స్
మా అమ్మకు పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు.. నా బావ ప్రభాస్‌కు కృతజ్ఞతలు.. మోహన్ బాబు కామెంట్స్

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన కన్నప్ప సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 7న గుంటూరులో ఘనంగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

డా. మోహన్ బాబు మాట్లాడుతూ .. "మా అమ్మకి పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు. అందరూ నా వాయిస్‌ని మెచ్చుకుంటుంటే ఆ మాటలు మా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది అనుకునేవాడిని. జీవితంలో భయం అనేది ఉండకూడదు, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూడదు, మా విద్యాలయాల్లో విద్యార్థులకు అదే నేర్పిస్తున్నాను" అని అన్నారు.

8 సంవత్సరాలు కష్టపడి

"కన్నప్ప సినిమాని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశాము. నా బిడ్డ ఎంతో కష్టపడ్డాడు.. ఎలా ఈ సినిమా తీసాడు అనేది నేను చెప్పదలచుకోలేదు. సినిమానే మాట్లాడుతుంది" అని మోహన్ బాబు తెలిపారు.

"నా కంటే చిన్నవాడు, నా భావ ప్రభాస్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమిద్దరం బావా బావా అని పిలుచుకుంటాం. మా మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్‌గా ఉన్న టాప్ హీరోలలో ప్రభాస్ ఒకడు. సినిమాలో నటించాలని కోరిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన వందేళ్లు క్షేమంగా ఉండాలి" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

భారతం గర్వించదగ్గ నటుడు

"ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్‌గా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నాకు డ్యాన్స్ అంటే ఏంటో నేర్పించారు. జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ సినిమాను ఆశీర్వదించండి" అని నటుడు, నిర్మాత మోహన్ బాబు కోరారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks