...
...
Next Story

మోహన్ బాబు ఆల్కహాల్ లాంటోడు.. ఆ మత్తులో ప్రభాస్: బ్రహ్మానందం

కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో మోహన్ బాబు గురించి సరాదాగా మాట్లాడారు బ్రహ్మానందం. పంచ్‍లు వేశారు. మోహన్ బాబు తనకు నచ్చరని చెప్పారు. ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ ఎందుకు అంగీకరించారో వెల్లడించారు.

Published on: Jun 21, 2025 08:57 PM IST
By
Prefer HTon Google
Advertisement

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, 'హాస్యబ్రహ్మా' బ్రహ్మానందం మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో కొన్ని ఈవెంట్లలో ఈ ఇద్దరు సరదాగా ముచ్చటించుకున్నారు. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకున్నారు. తాజాగా మరోసారి అలాంటిదే జరిగింది. నేడు (జూన్ 21) జరిగిన కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో మోహన్ బాబు గురించి సరదాగా మాట్లాడారు బ్రహ్మానందం. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఎందుకు నటించారో, ఆయన పాత్ర ఎలా ఉండనుందో కూడా చెప్పారు.

ప్రభాస్ డబ్బు కోసం కాదు

మోహన్ బాబు ఆల్కహాల్ లాంటోడు.. ఆ మత్తులో ప్రభాస్: బ్రహ్మానందం
మోహన్ బాబు ఆల్కహాల్ లాంటోడు.. ఆ మత్తులో ప్రభాస్: బ్రహ్మానందం

ప్రపంచం గర్వించదగ్గ నటుడు ప్రభాస్అని బ్రహ్మానందం అన్నారు. కన్నప్ప సినిమాను ప్రభాస్ డబ్బు కోసమో, గొప్ప క్యారెక్టర్ వచ్చిందో అని అంగీకరించలేదని బ్రహ్మానందం అన్నారు. ప్రభాస్ గొప్ప మానవతా విలువలు ఉన్న మంచి మనిషి అని, ఎవరైనా ఏదైనా అడిగితే ప్రభాస్ కాదనరని చెప్పారు. మోహన్ బాబుకు ప్రభాస్ చాలా సన్నిహితుడు అని, అందుకే ప్రభాస్ ఈ చిత్రం చేశారని బ్రహ్మానందం చెప్పారు.

మోహన్ బాబు ఓ ఆల్కహాల్.. ప్రభాస్ పాత్ర అద్భుతం

మోహన్ బాబు ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వారని, అలవాటైతే వదిలిపెట్టలేమని బ్రహ్మానందం అన్నారు. “మోహన్ బాబు మత్తులో, ప్రేమలో మునిగితేలినటువంటి వ్యక్తి ప్రభాస్” అని బ్రహ్మానందం అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్పారు. “శివ ప్రభాసుడు, శివుడితో ప్రకాశవంతంగా వెలిగేవాడు. ఆరడుగుల అందగాడు. ప్రభాస్ అలా వస్తున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. వీర తాండవం, శివతాండవం చేసేలా ప్రభాస్ నటించారు. నేను చూశా” అని బ్రహ్మానందం చెప్పారు. ప్రభాస్ గురించి చెబుతున్నంతసేపు ప్రేక్షకులకు కేరింతలతో ఆడిటోరియం మోతెక్కిపోయింది.

మోహన్ బాబు నాకు నచ్చడు

మోహన్ బాబులో నచ్చిన, నచ్చని విషయాలు చెప్పాలని బ్రహ్మానందాన్ని యాంకర్ సుమ అడిగారు. దీనికి సరదాగా సమాధానం చెప్పారు బ్రహ్మానందం. నచ్చినవి, నచ్చనవీ ఏవీ లేవని చెప్పారు. “అసలు మోహన్ బాబే నచ్చడు నాకు” అని సరదాగా అన్నారు బ్రహ్మీ. అవాక్కయ్యానని సుమ అంటే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయంటూ సరదాగా అన్నారు బ్రహ్మానందం.

కన్నప్ప చిత్రం జూన్ 27వ తేదీన విడుదల కానుంది. శివుడి మహాభక్తుడు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషించారు మంచు విష్ణు. ఈ మూవీని మోహన్ బాబు నిర్మించడంతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలకపాత్ర పోషించారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కూడా నటించారు. బ్రహ్మానందం కూడా ఓ పాత్రలో కనిపించనున్నారు. కన్నప్పమూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe