...
...
Next Story

జియోహాట్‌స్టార్‌లో ఉన్న మోహన్‌లాల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తుడరుమ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా..

మోహన్‌లాల్ నటించిన బ్లాక్‌బస్టర్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ తుడరుమ్ శుక్రవారం (మే 30) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలుసు కదా. ఇదొక్కటే కాదు.. ఈ ఓటీటీలో ఈ స్టార్ హీరో నటించిన మరికొన్ని థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి.

Published on: May 30, 2025, 19:50:05 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

తుడరుమ్.. ఈ ఏడాది పెను సంచలనం సృష్టించిన మలయాళ రివేంజ్ థ్రిల్లర్ మూవీ. మోహన్‌లాల్, శోభన లీడ్ రోల్స్ లో తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తానికి జియోహాట్‌స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ అయింది. ఓటీటీలో ఈ మూవీని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా తెగ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే జియోహాట్‌స్టార్ లో మోహన్‌లాల్ నటించిన ఇతర థ్రిల్లర్ సినిమాలేవో ఒకసారి చూద్దాం.

ఎల్2: ఎంపురాన్

జియోహాట్‌స్టార్‌లో ఉన్న మోహన్‌లాల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తుడరుమ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా..
జియోహాట్‌స్టార్‌లో ఉన్న మోహన్‌లాల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తుడరుమ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా..

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా చరిత్ర సృష్టించిన ఎల్2: ఎంపురాన్ కూడా జియోహాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కూడా ఈ ఏడాదే రిలీజైంది. మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లూసిఫర్ మూవీకి సీక్వెల్. ఆ సినిమా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించింది.

ఒప్పమ్

మోహన్లాల్ ఓ అంధుడిగా నటించిన ఒప్పమ్ (Oppam) మూవీ 2016లో వచ్చింది. ఇది కూడా ఓ థ్రిల్లర్ మూవీయే. తాను గతంలో జైలుకు పంపించిన ఓ దోషి నుంచి తన కూతురిని కాపాడుకోవడానికి ఓ జడ్జి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతడు హత్యకు గురవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సైకో కిల్లర్ నుంచి ఆ అమ్మాయిన అంధుడైన హీరో ఎలా కాపాడతాడన్నదే ఈ ఒప్పమ్ మూవీ స్టోరీ.

నేరు

నేరు 2023లో రిలీజైన కోర్ట్ రూమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ అడ్వొకేట్ గా నటించాడు. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు. ఓ అంధురాలైన అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. అయితే అలాంటి పరిస్థితుల్లోనూ అతని ముఖాన్ని చేతులతో తడుముతూ అతని రూపాన్ని గుర్తుంచుకుంటుంది. తర్వాత తనకు బాగా తెలిసిన విద్యతో అచ్చూ అతని రూపంలోనే ఉన్న బొమ్మ తయారు చేస్తుంది. ఆమె తరఫున కోర్టులో వాదించే అడ్వొకేట్ కు నిందితుడిని పట్టించడానికి ఉండే ఒకే సాక్ష్యాధారం అదొక్కటే. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ.

12th మ్యాన్

మాన్‌స్టర్ 2022లో వచ్చిన మూవీ. ఇందులో మోహన్‌లాల్ లక్కీ సింగ్, శివ్‌దేవ్ సుబ్రమణ్యం అనే రెండు పాత్రల్లో కనిపించాడు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks