ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ మూవీ.. 2020లో షూటింగ్.. 2025లో థియేటర్లలో.. మైఖేల్ జాక్సన్ కావాలనుకునే కుర్రాళ్ల కథ

పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ను ఆరాధిస్తూ.. ఆయనలా స్టెప్పులు వేయాలనుకునే కుర్రాళ్ల కథతో వచ్చిన మలయాళం సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజైంది. ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. 2020లో షూటింగ్ చేసుకున్న ఈ సినిమా అయిదేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ కావడం గమనార్హం. 

Published on: Jul 8, 2025, 06:20:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకప్పుడు తన స్టెప్పులతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు మైఖేల్ జాక్సన్. ఆయన మరణించినా తన డ్యాన్స్ తో ఎప్పటికీ జీవించే ఉంటారు. మైఖేల్ జాక్సన్ వేసిన బ్రేక్ డ్యాన్స్ స్టెప్పుల్లో ఐకానిక్ మూన్‌వాక్ కు ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు ఇదే స్టెప్ పేరుతో వచ్చిన మలయాళం సినిమా ఓటీటీలో రిలీజైంది. మూన్‌వాక్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ సినిమా (x/JioHotstar Malayalam)
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ సినిమా (x/JioHotstar Malayalam)

2020లో షూటింగ్ స్టార్ట్

2020లో మూన్వాక్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే అది 2025లో థియేటర్లలో రిలీజైంది. చివరకు ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి థియేటర్లలో విడుదల చేశారు. 2025 మే 30న ఈ మూవీ రిలీజ్ అయింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో 8 రేటింగ్ దక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీఆడియన్స్ ను కూడా ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

ఏ ఓటీటీలో అంటే

మలయాళం మూవీ మూన్‌వాక్ (Moonwalk) జియోహాట్స్టార్ ఓటీటీలో ఈ రోజు (జూలై 8) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. మైఖేల్ జాక్సన్ పాపులర్ డ్యాన్స్ మూవ్ పేరునే ఈ సినిమాకు పెట్టారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు.

ఎ.కె. వినోద్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 'మూన్‌వాక్'లో ప్రధాన నటులలో ఎక్కువ మంది కొత్తవాళ్లే. షేర్షా షరీఫ్, అనునాథ్, రిషి కైనిక్కర, సిద్ధార్థ్ బి, మనోజ్ మోసెస్, సుజిత్ ప్రభాకర్, నైనిత మరియా, శ్రీకాంత్ మురళి, మీనాక్షి రవీంద్రన్, అర్జున్ మణిలాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

మూన్‌వాక్ మూవీ గురించి..

'మూన్‌వాక్' కథ నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒకప్పటి పాప్ సామ్రాజ్యపు రాజు మైఖేల్ జాక్సన్ స్ఫూర్తితో బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవాలని కలలు కనే యువకుల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్కూల్‌కు వెళ్తూ లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ యువకులు డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులను అధిగమిస్తారో ఈ మూవీలో చూపించారు. ఒక కాంపిటీషన్ లో పాల్గొనడానికి డ్యాన్స్ స్టెప్స్‌ని పక్కాగా నేర్చుకోవడానికి వారు పడే కష్టాన్ని కూడా ఇందులో చూడొచ్చు. ఇది 1980ల నాటి కేరళలోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో సాగే కథనం.

స్క్రీన్‌ప్లేను ఎ.కె. వినోద్, మాథ్యూ వర్గీస్, సునీల్ గోపాలకృష్ణన్ కలిసి రాశారు. డ్యాన్స్ లవర్స్ తోపాటు మైఖేల్ జాక్సన్ ను అమితంగా ఆరాధించే ప్రేక్షకులకు ఈ మూన్‌వాక్ మూవీ బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More