ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో హవా

ఓటీటీల్లో జూన్ 23 నుంచి 29 వరకు ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం. వీటిలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందిన కంటెంటే ఎక్కువగా ఉండటం విశేషం.

Jun 30, 2025, 20:02:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో తెలుసా? ఆర్మాక్స్ మీడియా తాజాగా గత వారానికి సంబంధించిన జాబితాను రిలీజ్ చేసింది. దీని ప్రకారం జూన్ 23 నుంచి జూన్ 29 వరకు ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఏవో చూద్దాం. ఇండియన్ ఆడియెన్స్, అందులోనూ కనీసం 30 నిమిషాల పాటు చూసిన వాటినే లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను తయారు చేశారు.

ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో హవా
ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో హవా

టాప్ 5 సినిమాలు ఇవే

ఆర్మాక్స్ మీడియా ప్రకారం ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల విషయానికి వస్తే వీటిలో హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైడ్ 2 (Raid 2) తొలి స్థానంలో ఉంది. ఈ సినిమాను గత వారం 4.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో స్థానంలో అక్షర్ కుమార్ నటించిన మరో హిందీ మూవీ కేసరి ఛాప్టర్ 2 ఉంది.

జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి 3.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మూడోస్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తెలుగు డైరెక్టర్ తొలి హిందీ మూవీ జాట్ 2.5 మిలియన్ వ్యూస్ తో నిలిచింది. నాలుగు, ఐదు స్థానాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని మూవీస్ ఉన్నాయి. ఇమ్రాన్ హష్మి నటించిన గ్రౌండ్ జీరో (2.4 మిలియన్ వ్యూస్), విజయ్ సేతుపతి తమిళ మూవీ ఏస్ (2.3 మిలియన్ వ్యూస్) టాప్ 5లో ఉన్నాయి.

టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే

ఇక ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ విషయానికి వస్తే గత వారం ఎక్కువ మంది చూసిన సిరీస్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోని పంచాయత్ సీజన్ 4 నిలిచింది. ఈ సిరీస్ కు 8.8 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. రెండో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోని స్క్విడ్ గేమ్ సీజన్ 3 (4.8 మిలియన్ వ్యూస్) ఉంది. మూడోస్థానంలో జియోహాట్‌స్టార్ లో ఉన్న క్రిమినల్ జస్టిన్ సీజన్ 4 నిలిచింది. ఈ సిరీస్ కు 4.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అంతకుముందు రెండు వారాల పాటు టాప్ లో ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయింది. ఇక నెట్‌ఫ్లిక్స్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 ఉంది. దీనికి 3.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ 3.4 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More