టూరిస్ట్ ఫ్యామిలీ నచ్చిందా? జియోహాట్‌స్టార్‌లోనే ఉన్న అలాంటి ఫ్యామిలీ డ్రామా మూవీస్‌పై ఓ లుక్కేయండి
చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజై సంచలన సృష్టించిన మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఓటీటీలోనూ ఈ తమిళ సినిమా దూసుకెళ్తోంది. అలాంటి ఫ్యామిలీ కామెడీ, ఎమోషన్ ఉన్న ఇతర సినిమాలూ జియోహాట్‌స్టార్‌లో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.
ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ గురించి పెద్ద టాక్ వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ తమిళ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. స్వచ్ఛమైన కామెడీ, గుండెను హత్తుకునే ఎమోషన్, హాయి కలిగించే ఫ్యామిలీ డ్రామా.. ఇలా టూరిస్ట్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికీ తెగ నచ్చేస్తోంది.

ఓటీటీలోనూ అదుర్స్
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. జూన్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. జియోహాట్స్టార్ ఓటీటీలో ఈ మూవీ ఉంది. ఇప్పటికే మీరు ఈ మూవీ చూసి ఉంటే తప్పక నచ్చే ఉంటుంది. ఇదే ఓటీటీలో ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ సినిమాలు ఇంకా ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ మూవీస్ లిస్ట్ మీ కోసం.
ఫలిమీ
ఒక కుటుంబంలో వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ.. విభిన్నమైన మనస్తత్వంతో ఉండే మనుషుల కథ ఇది. ఆ ఇంట్లోని పెద్దాయనను కాశీకి తీసుకెళ్లే క్రమంలో జరిగే మానసిక సంఘర్షణ, అక్కడికి వెళ్లాక ఎదురయ్యే ట్విస్ట్ లు.. ఈ మలయాళ సినిమా ఫలిమీని ప్రత్యేకంగా మార్చాయి. కాశీలో తాతయ్య చనిపోయారని, అంత్యక్రియలు కూడా జరిగాయని తెలిశాక ఆ ఫ్యామిలీ ఎమోషన్ ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుంది. కానీ తీరా తాతయ్య బతికే ఉన్నాడని తెలిశాక ఏం జరిగింది? కాశీ ప్రయాణం పూర్తయిందా? అనేది ఆసక్తి రేపుతోంది.
గుల్మోహర్
తరతరాలుగా ఉంటున్న ఇంటికి వదిలి వెళ్లే క్రమంలో ఓ కుటుంబం పడ్డ ఆవేదన, ఆ సమయంలో బయటపడే రహస్యాలు.. ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన హిందీ సినిమా గుల్మోహర్. కుటుంబ అనుబంధాలు, సమయాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా మారే మనుషులు.. ఇలా మనసును తాకే ఎమోషన్స్ తో ఈ మూవీ రూపొందింది.
బజరంగీ భాయిజాన్
పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చి, ఇక్కడ తప్పిపోయిన ఓ పాపను తిరిగి వాళ్ల దేశం చేర్చే హీరో కథే బజరంగీ భాయిజాన్ సినిమా. ఈ సల్మాన్ ఖాన్బ్లాక్ బస్టర్ మూవీ కచ్చితంగా హృదయాన్ని కదిలిస్తుంది. తల్లితో కలిసి పాక్ నుంచి భారత్ వచ్చిన మూగ పాప ఇక్కడ మధ్యలో రైలు దిగుతుంది. ఆ రైల్లో తల్లి వెళ్లిపోతుంది. ఆ పాపను హీరో తిరిగి పాకిస్థాన్ కు ఎలా చేర్చాడు? ఆ క్రమంలో నెలకొన్న ఎమోషనల్ జర్నీ ఎలాంటిది? అనేది ఈ మూవీలో చూడొచ్చు.
దృశ్యం
ఫ్యామిలీ ఎమోషన్, కుటుంబం కోసం హీరో పోరాడే కథ అంటే ముందుగా గుర్తొచ్చే సినిమాల్లో కచ్చితంగా దృశ్యం ఉంటుంది. తన కుటుంబానికి ఊహించని సమస్య ఎదురైతే.. తండ్రి ఎలా నిలబడ్డాడు? అనేదే దృశ్యం కథ. ఈ మూవీ మంచి థ్రిల్లర్ కూడా. ఈ మలయాళ ఒరిజినల్ మూవీని హిందీ, తెలుగులోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. దృశ్యం 2 కూడా ఆడియన్స్ ను అలరించింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper













