సెన్సార్ బోర్డుకు క్షమాపణ చెప్పిన మోగ్లీ మూవీ నిర్మాతలు.. ఆ ఆఫీసర్ భయపడిపోయాడన్న నటుడి కామెంట్స్ ఫలితం

రోషన్ కనకాల లీడ్ రోల్లో నటించిన మోగ్లీ మూవీ నిర్మాతలు సెన్సార్ బోర్డుకు క్షమాపణ చెప్పారు. ఈ మూవీలో విలన్ పాత్ర పోషించిన బండి సరోజ్ చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో వాళ్లు ఎక్స్ ద్వారా క్షమాపణ చెప్పడం గమనార్హం.

Published on: Dec 11, 2025, 20:28:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన మరో మూవీ మోగ్లీ. ఈ సినిమా శనివారం (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెన్సార్ బోర్డును క్షమాపణ కోరింది. ఆ సెన్సార్ బోర్డు ఆఫీసర్ తన నటన చూసి భయపడిపోయాడట అని మూవీలో విలన్ పాత్ర పోషించిన బండి సరోజ్ చేసిన కామెంట్స్ తో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సెన్సార్ బోర్డుకు క్షమాపణ చెప్పిన మోగ్లీ మూవీ నిర్మాతలు.. ఆ ఆఫీసర్ భయపడిపోయాడన్న నటుడి కామెంట్స్ ఫలితం
సెన్సార్ బోర్డుకు క్షమాపణ చెప్పిన మోగ్లీ మూవీ నిర్మాతలు.. ఆ ఆఫీసర్ భయపడిపోయాడన్న నటుడి కామెంట్స్ ఫలితం

సెన్సార్ బోర్డుకు క్షమాపణ

గురువారం (డిసెంబర్ 11) మోగ్లీ మూవీని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. సెన్సార్ బోర్డు, సెన్సార్ ఆఫీసర్ కు క్షమాపణ చెబుతున్నట్లు అందులో ఉంది. “మా నటుడు బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా వచ్చినవే. సెన్సార్ ప్రక్రియ పట్ల మాకు అత్యున్నత గౌరవం ఉంది. బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో కంటెంట్‌ను పర్యవేక్షించే బోర్డు పాత్రను మేము ఎంతగానో గౌరవిస్తాం" అని సంస్థ స్పష్టం చేసింది.

"సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్లు, సీనియర్ ఇండస్ట్రీ ప్రముఖులతో కూడిన సెన్సార్ బోర్డు ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలను మేము ఎంతో విలువైనవిగా భావిస్తాం.. ఆ వ్యాఖ్యలు కేవలం యాదృచ్ఛికంగా వచ్చినవే. వాటిని పబ్లిష్ అయిన అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం/తొలగిస్తున్నాం” అని అందులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చెప్పింది.

అసలు ఏం జరిగిందంటే?

మోగ్లీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో బండి సరోజ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చినంత మాత్రాన ఇందులో ఏదో అసభ్యంగా ఉందని అనుకోకండని.. తాను పోషించిన ఓ దయలేని పోలీసు పాత్రను చూసిన సెన్సార్ ఆఫీసర్ భయపడిపోయాడని, అందుకే ఎ సర్టిఫికెట్ ఇచ్చాడని అన్నాడు. ఈ విషయం తనకు డైరెక్టర్ సందీప్ రాజ్ చెప్పాడని తెలిపాడు.

అతడు ఆ కామెంట్స్ చేసిన సమయంలో వెనకాలే ఉన్న రానా కూడా నవ్వుతూ రోషన్ కనకాలతో ఏదో అన్నాడు. సరోజ్ చేసిన ఈ కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పింది. మోగ్లీ సినిమా శుక్రవారమే రిలీజ్ కావాల్సి ఉన్నా.. అఖండ 2 రిలీజ్ ఉండటంతో ఒక రోజు ఆలస్యంగా శనివారం రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More